జున్ను | Junnu Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Junnu recipe in Telugu,జున్ను, Dharani Jhansi Grandhi
జున్నుby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

జున్ను వంటకం

జున్ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Junnu Recipe in Telugu )

  • జున్ను పాలు 1 కప్పు
  • మామూలు గేదె పాలు 2 కప్పులు
  • బెల్లం పొడి 1 కప్
  • మిరియాల పొడి కొద్దిగా
  • యాలక్కాయలు దంచినవి 2

జున్ను | How to make Junnu Recipe in Telugu

  1. మొదటి రోజు జున్ను పాలు అయితే ఒకటికి రెండు కప్పుల గేదె పాలు పడతాయి.
  2. రెండవ రోజు జున్ను పాలు అయితే ఒక కప్పు జున్ను పాలకి కి సగం కప్పు గేదె పాలు పడతాయి.
  3. ఆ జున్ను పాలు లో గేదె పాలు కలిపి అందులో బెల్లం పొడి కలిపి , బెల్లం ముక్కలు మొత్తం కరిగే వరకు తిప్పి ఒడ కట్టాలి
  4. ఇప్పుడు ఈ పాలలో మిరియాలు,యాలక్కాయల పొడి కలిపి ఇడ్లీ కుక్కర్ లో ఉడికించాలి. ఉడికిందో లేదో టూత్ స్టిక్ గుచ్చి చేసుకోవాలి . స్టిక్ కి అంటుకొక పోతే ఉడికిపోయినట్టు .
  5. చల్లార్చుకొని నచ్చిన ఆకారాల్లో ముక్కలు కోసుకొని , సర్వ్ చేసుకోవాలి .

Reviews for Junnu Recipe in Telugu (0)