కొర్ర బియ్యం పొంగల్ | MILLETS UPMA Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of MILLETS UPMA by Sandhya Rani Vutukuri at BetterButter
కొర్ర బియ్యం పొంగల్by Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

కొర్ర బియ్యం పొంగల్ వంటకం

కొర్ర బియ్యం పొంగల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MILLETS UPMA Recipe in Telugu )

  • కొర్రలు లేదా కిన్వలు 1/4 కేజీ
  • మైసూర్ పప్పు లేదా పెసర పప్పు 1/8కేజీ
  • క్యారెట్ లు 2
  • బీన్స్ 5
  • పచ్చిబఠాని (వుంటే నే)2 చెంచాలు
  • తీపి మొక్క జొన్న గింజలు 2 చెంచాలు
  • పచ్చి మిర్చి 5 చీలికలు
  • మిరియాలు 10(లేదా పొడి)
  • జీడీ పప్పులు 10
  • జీలకఱ్ఱ 2 చెంచాలు
  • పోపు కు ఆవాలు, మిర్చి,పసుపు,కరివేపాకు
  • ఉప్పు తగినంత
  • నెయ్యి 1/2 కప్పు
  • నీళ్లు ( ధాన్యానికిడబల్ కొలత)

కొర్ర బియ్యం పొంగల్ | How to make MILLETS UPMA Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్, బీన్స్, బఠాని, మిర్చి లను కడిగి తరిగి వుంచు కోవాలి
  2. కొర్రలు కడిగి వుంచు కోవాలి
  3. పప్పు ను కడిగి ఉంచుకోవాలి
  4. కుక్కర్ పొయ్యి పై పెట్టి, నెయ్యి వేసి, పోపు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు,కూరలు, మిరియాలు(పొడి) ఒకదాని తరువాత ఒకటి వేసి వేగనివ్వాలి.
  5. 3 ని.ల తరువాత పసుపు వేసి బియ్యం, పప్పు నీరు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి విజిల్ పెట్టాలి.
  6. అంతే రుచికరమైన పొంగల్ తయారు. కొత్తి మీర తో వొడ్డించండి.

నా చిట్కా:

పొంగల్ ను చాలా దగ్గరగా గట్టి పడే లాగా కాకుండా గంటె జారే లాగా చూసుకొని తీస్తే బావుంటుంది. చల్లా రాక గట్టి పడుతుంది

Reviews for MILLETS UPMA Recipe in Telugu (0)