హోమ్ / వంటకాలు / కొర్ర బియ్యం పొంగల్

Photo of MILLETS UPMA by Sandhya Rani Vutukuri at BetterButter
1053
3
0.0(0)
0

కొర్ర బియ్యం పొంగల్

Aug-29-2018
Sandhya Rani Vutukuri
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్ర బియ్యం పొంగల్ రెసిపీ గురించి

ఈ రోజుల్లో చిరు ధాన్యాల విప్లవం ఎక్కువయ్యింది. రోటీన్ల తో యాంత్రికంగా పని తొందరలతో హడావుడి జీవితం గడిపే వారికోసం ఈరోజు నేను మా పాత కాలం వంట మీతో పంచుకుంటున్నాను. ఈ తరం వాళ్లకు కిన్వలు అంటే తెలుసు కానీ కొర్రలు అంటే తెలియదు. అమ్మమ్మ ల కాలం లో కొర్రల తో నాగుల చవితి కి పాయసం చేసే వారు. అన్ని కూర ల తో చిరుధాన్యాల కిచిడి ని చేసి రుచి చూడండి. ఇందులో చాలా తక్కువ పిండి పదార్థాలు ఉంటాయట. ఈ కిచిడి ఎంతో రుచి గా వుండి పుష్టి కరమైనది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రలు లేదా కిన్వలు 1/4 కేజీ
  2. మైసూర్ పప్పు లేదా పెసర పప్పు 1/8కేజీ
  3. క్యారెట్ లు 2
  4. బీన్స్ 5
  5. పచ్చిబఠాని (వుంటే నే)2 చెంచాలు
  6. తీపి మొక్క జొన్న గింజలు 2 చెంచాలు
  7. పచ్చి మిర్చి 5 చీలికలు
  8. మిరియాలు 10(లేదా పొడి)
  9. జీడీ పప్పులు 10
  10. జీలకఱ్ఱ 2 చెంచాలు
  11. పోపు కు ఆవాలు, మిర్చి,పసుపు,కరివేపాకు
  12. ఉప్పు తగినంత
  13. నెయ్యి 1/2 కప్పు
  14. నీళ్లు ( ధాన్యానికిడబల్ కొలత)

సూచనలు

  1. ముందుగా క్యారెట్, బీన్స్, బఠాని, మిర్చి లను కడిగి తరిగి వుంచు కోవాలి
  2. కొర్రలు కడిగి వుంచు కోవాలి
  3. పప్పు ను కడిగి ఉంచుకోవాలి
  4. కుక్కర్ పొయ్యి పై పెట్టి, నెయ్యి వేసి, పోపు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు,కూరలు, మిరియాలు(పొడి) ఒకదాని తరువాత ఒకటి వేసి వేగనివ్వాలి.
  5. 3 ని.ల తరువాత పసుపు వేసి బియ్యం, పప్పు నీరు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి విజిల్ పెట్టాలి.
  6. అంతే రుచికరమైన పొంగల్ తయారు. కొత్తి మీర తో వొడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర