గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి) | Gongura pickle Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gongura pickle recipe in Telugu,గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి), Pendekanti Suneetha
గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి)by Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి) వంటకం

గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura pickle Recipe in Telugu )

  • గోంగూర. 2 కట్టలు
  • చింతపండు. 1 పెద్ద నిమ్మకాయంత
  • వెల్లుల్లి రెబ్బలు. 15
  • ఆవాలు,,జీలకర్ర. 1 స్పూన్
  • మెంతులు. 1/2 స్పూన్
  • ఆయిల్. 7 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • ఎండు కారం. 3 స్పూన్స్

గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి) | How to make Gongura pickle Recipe in Telugu

  1. గోంగూర బాగా కడిగి అరబెట్టుకోవాలి.
  2. చింతపండు వేడినీటి లో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి.
  3. వెల్లుల్లి పాయలు వలిచి పెట్టుకోవాలి.
  4. ఒక బాణాలి లో 2 స్పూన్ ఆయిల్ వేసి కాగాక గొంగుర వేసి వేయించి చల్లార్చి మిక్సీ పట్టాలి.
  5. ఒక బాణాలి లో ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర, మెంతులు వేసి వేగాక వెల్లుల్లి వేసి వేగాక చింతపండు గుజ్జు వేయాలి. అందులో పసుపు,,ఉప్పు వేసి ఉడికించాలి.
  6. బాగా ఉడికాక గోంగూర ముద్దకూడా వేసి ఆయిల్ పైకి వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి
  7. కొద్దిగా చల్లారాక కారం వేసి కలపాలి.వేడిగా వున్నప్పుడు కలిపితే చేదు వస్తుంది

నా చిట్కా:

తడి లేకుండా ఉడికిస్తే 20 రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Gongura pickle Recipe in Telugu (0)