హోమ్ / వంటకాలు / గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి)

Photo of Gongura pickle by Pendekanti Suneetha at BetterButter
1229
2
0.0(0)
0

గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి)

Aug-29-2018
Pendekanti Suneetha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర ఊరగాయ(నిల్వ పచ్చడి) రెసిపీ గురించి

ఈపచ్చడి గోంగూర తో చేస్తాము. తడి లేకుండా ఉడికిస్తే 20 రోజులు నిల్వ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర. 2 కట్టలు
  2. చింతపండు. 1 పెద్ద నిమ్మకాయంత
  3. వెల్లుల్లి రెబ్బలు. 15
  4. ఆవాలు,,జీలకర్ర. 1 స్పూన్
  5. మెంతులు. 1/2 స్పూన్
  6. ఆయిల్. 7 స్పూన్స్
  7. ఉప్పు తగినంత
  8. ఎండు కారం. 3 స్పూన్స్

సూచనలు

  1. గోంగూర బాగా కడిగి అరబెట్టుకోవాలి.
  2. చింతపండు వేడినీటి లో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి.
  3. వెల్లుల్లి పాయలు వలిచి పెట్టుకోవాలి.
  4. ఒక బాణాలి లో 2 స్పూన్ ఆయిల్ వేసి కాగాక గొంగుర వేసి వేయించి చల్లార్చి మిక్సీ పట్టాలి.
  5. ఒక బాణాలి లో ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర, మెంతులు వేసి వేగాక వెల్లుల్లి వేసి వేగాక చింతపండు గుజ్జు వేయాలి. అందులో పసుపు,,ఉప్పు వేసి ఉడికించాలి.
  6. బాగా ఉడికాక గోంగూర ముద్దకూడా వేసి ఆయిల్ పైకి వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి
  7. కొద్దిగా చల్లారాక కారం వేసి కలపాలి.వేడిగా వున్నప్పుడు కలిపితే చేదు వస్తుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర