ఉల్లిపాయ మెంతి పులుసు | TANGY Onion methi gravy Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • TANGY Onion methi gravy recipe in Telugu,ఉల్లిపాయ మెంతి పులుసు, Sridevi Vedantham
ఉల్లిపాయ మెంతి పులుసుby Sridevi Vedantham
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

ఉల్లిపాయ మెంతి పులుసు వంటకం

ఉల్లిపాయ మెంతి పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TANGY Onion methi gravy Recipe in Telugu )

 • ఉల్లిపాయలు - 4
 • చింతపండు - పెద్ద సైజు నిమ్మ కాయ అంత
 • నీరు - 3/4 లీటర్
 • ఉప్పు - 1 టేబుల్ స్పూన్
 • పసుపు - 1/4 టీ స్పూన్
 • ఎండు మిరపకాయలు - 4
 • చెక్కర లేదా బెల్లం - 1 స్పూన్
 • బియ్యప్పిండి - 1 టేబుల్ స్పూన్
 • ఆవాలు - 1/4 టీస్పూన్
 • మెంతులు - 2 టీ స్పూన్లు
 • పచ్చి సెనగపప్పు, మినప్పప్పు - 1/4 టీస్పూన్ చొప్పున
 • కొత్తిమీర - 1/4 కట్ట
 • కరివేపాకు - 2 రెమ్మలు
 • ఇంగువ చిటికెడు

ఉల్లిపాయ మెంతి పులుసు | How to make TANGY Onion methi gravy Recipe in Telugu

 1. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి
 2. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నూనె వేసి వరుసగా, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, సెనగపప్పు, జీరా, ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి మెంతులు ఎర్రగా వేగనిఛ్చి అందులో ఉల్లిపాయలు,కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
 3. ముందుగా నాన పెట్టిన చింతపండు పిండి రసం తీసి వేగుతున్న ఉల్లిపాయ ల్లో పోసి, ఉప్పు, చెక్కర, పసుపు, వేసి 750మి. లీ నీరు పోసి 7 నిమిషాలుబాగా మరగనిఛ్చి,
 4. ఆఖరున చిన్న గిన్నెలో బియ్యప్పిండి లో నీరు కలిపి పల్చగా చేసి, మరుగుతున్న పులుసు లో పోసి 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి.
 5. ఘుమ ఘుమ లాడే రుచికరమైన ఉల్లిపాయ మెంతి పులుసు రెడీ

నా చిట్కా:

బెండకాయ కూర జిగురు లేకుండా వేగాలంటే కొన్న తర్వాత కడిగి,ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్ లో మూత లేని బౌల్ లో 1 పూట ఉంచి వేపాలి.

Reviews for TANGY Onion methi gravy Recipe in Telugu (0)