నోరూరించే పెరుగు వడ | Mouth watering curd vada Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mouth watering curd vada recipe in Telugu,నోరూరించే పెరుగు వడ, Sridevi Vedantham
నోరూరించే పెరుగు వడby Sridevi Vedantham
 • తయారీకి సమయం

  4

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

నోరూరించే పెరుగు వడ వంటకం

నోరూరించే పెరుగు వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mouth watering curd vada Recipe in Telugu )

 • మినప్పప్పు - 2 కప్పులు
 • నీరు - నాన పెట్టడానికి సరిపడా
 • ఉప్పు - రుచికి సరిపడా
 • పచ్చి మిర్చి - 2
 • ఎండు మిర్చి - 1
 • అల్లం - చిన్న ముక్క
 • పెరుగు - 1 లీటర్
 • కొత్తిమీర - కొద్దిగా
 • ఆవాలు, జీర, మినప్పప్పు, ఇంగువ
 • తమలపాకు

నోరూరించే పెరుగు వడ | How to make Mouth watering curd vada Recipe in Telugu

 1. ముందుగా మినప్పప్పు, సరిపడా నీరు పోసి 3 గంటల పాటు నానపెట్టాలి
 2. 3 గంటల తర్వాత నీరు మొత్తం వడ కట్టి, గ్రైండర్ లో కొద్దిగా నీరు పోసి పిండి గట్టిగ ఋబ్బు కోవాలి.
 3. పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకోవాలి.
 4. పెరుగులో తగిన ఉప్పు వేసి బాగా కలిపి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలపి పెట్టుకోవాలి
 5. స్టవ్ పై బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి బాగా వేడి చెయ్యాలి
 6. ఇప్పుడు రుబ్బిన పిండి లో రుచికి తగినంత ఉప్పు వేసుకుని తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, జీర వేసుకుని కలుపుకోవాలి.
 7. ఒక పెద్ద సైజు తమలపాకు పై కొంచెం కొంచెం పిండి తీసుకుని మధ్యలో చిల్లు పెట్టి, గారెలు కాగుతున్న నూనె లో వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.
 8. సిద్ధం చేసుకున్న పెరుగులో గారెలు వేసి 10 నిమిషాలు నాన నివ్వాలి.
 9. వడ్డించే ముందు కొద్దిగా నూనె లో ఆవాలు, మినప్పప్పు, జీర, ఎండు మిర్చి ముక్కలు వేసి, ఇంగువ వేసి పెరుగులో నుంచి తీసి ప్లేట్ లో గారెలు తీసుకుని వాటి పై ఈ పోపు వేసి కొత్తిమీర వేసి సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

బెండకాయ వేపుడు జిగురు రాకుండా వుండాలి అంటే, కొంచెం వేగాక 2 స్పూన్ల పెరుగు వేస్తే సరి

Reviews for Mouth watering curd vada Recipe in Telugu (0)