జీడిపప్పు ఉప్మా | Cashew Upma Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cashew Upma recipe in Telugu,జీడిపప్పు ఉప్మా, Sridevi Vedantham
జీడిపప్పు ఉప్మాby Sridevi Vedantham
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

జీడిపప్పు ఉప్మా వంటకం

జీడిపప్పు ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cashew Upma Recipe in Telugu )

  • ఉప్మా రవ్వ - 2 కప్
  • నీరు - 5 కప్
  • ఉప్పు - 1 టేబుల్ స్పూన్ లేదా రుచికి సరిపడా
  • నూనె - 50 మీ. లి
  • జీడి పప్పులు - 10
  • వేరుసెనగ పప్పులు - గుప్పెడు
  • టమాటో -1
  • క్యారట్ - 1
  • మొక్క జొన్న/ స్వీట్ కార్న్
  • పచ్చి మిర్చి - 4
  • అల్లం - కొద్దిగ
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర - 1/4 కట్ట
  • ఆవాలు, జీర, మినప్పప్పు, సెనగపప్పు - తలో 1/4 టీస్పూన్
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు ఉప్మా | How to make Cashew Upma Recipe in Telugu

  1. పాన్లో కొద్దిగ నెయ్యి వేసి జీడి పప్పులు వేయించి పక్కన పెట్టాలి
  2. అదే పాన్లో రవ్వ దోర గ వేయించి పక్కన పెట్టాలి
  3. పాన్లో నూనె పోసి, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, జీర, వేరుసెనగ పప్పులు వేసి చిటపటలాడాక పచ్చి మిర్చి, అల్లం, టమాటో, క్యారట్, మొక్కజొన్న గింజలు, కరివేపాకు వేయించి నీరు పోసి మరిగించాలి, ఉప్పు కూడా వెయ్యాలి.
  4. ఇప్పుడు వేయించిన రవ్వ మరుగుతున్న నీళ్ళలో పోస్తూ గరిట తో కలపాలి.
  5. ఇప్పుడు నెయ్యి వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దించి పైన కొత్తిమీర , వేయించి పెట్టుకున్న జీడి పప్పు తో అలంకరించుకోవాలి.

Reviews for Cashew Upma Recipe in Telugu (0)