తమలపాకు రైస్ | Beetel leaf rice Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  29th Aug 2018  |  
3 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Beetel leaf rice recipe in Telugu,తమలపాకు రైస్, Sudha Badam
తమలపాకు రైస్by Sudha Badam
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

1

తమలపాకు రైస్ వంటకం

తమలపాకు రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetel leaf rice Recipe in Telugu )

 • వండిన అన్నం 2 కప్పులు
 • లేత తమలపాకులు 6
 • పచ్చిమిర్చి 3
 • ఉల్లిపాయ 1
 • పోపు దినుసులు - సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేరుసనగగుళ్లు
 • ఆయిల్ 3 స్పూన్స్

తమలపాకు రైస్ | How to make Beetel leaf rice Recipe in Telugu

 1. వండిన అన్నాన్ని చల్లారబెట్టుకుని ఉంచుకోవాలి.
 2. తమలపాకులు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ లో గ్రైండ్ చేసుకోవాలి.
 3. పాన్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు,ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేగాక,ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేగాక, తమలపాకు పేస్ట్ వేసి కొద్దిగా పచ్చి వాసన పోయేలా వేయించుకుని కొద్దిగా పసుపు,కొద్దిగా ఉప్పు వేసి చల్లారిన అన్నాన్ని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

నా చిట్కా:

లేత తమలపాకులు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకోవడం మన ఇష్టం.

Reviews for Beetel leaf rice Recipe in Telugu (1)

Sandhya Rani Vutukuri8 months ago

బావుంది. మొదటిసారి విన్నాను. నోముల కు వొచ్చిన ఆకులు వృధా కాకుండా వుండే మంచి రెసిపీ.
జవాబు వ్రాయండి
Sudha Badam
8 months ago
అవునండి. థాంక్యూ.:blush: