హోమ్ / వంటకాలు / పాఠోళీ

Photo of Chickpeas kichadi by Swapna Tirumamidi at BetterButter
719
5
0.0(0)
0

పాఠోళీ

Aug-29-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాఠోళీ రెసిపీ గురించి

ఈ పాఠోళీ అనేది తరతరాలుగా వస్తోన్న ప్రత్యేక వంటకం. నాకు తెలిసినతవరకూ తూర్పుగోదావరి కోనసీమ ప్రాంతం లో కొన్ని కుటుంబాల వారు మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటారు.దీన్ని వేడి అన్నంలోకి ఆధరువుగా భుజిస్తారు.మా కుటుంబంలో దీన్ని తరచుగా చేసుకుంటాము.దీనికి మాంచి కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు లేదా వంకాయ పచ్చి పులుసు తోడు ఉండాలి .చాలా రుచిగా ఉంటుంది.చాలా సులభమైన పదార్ధాలే వాడతారు.కానీ కొంచం కష్ట పడాలి.భుజాలు కాస్త నొప్పి చేస్తాయి కలయబెట్టేటపుడు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బాగా నాన పెట్టిన కొమ్ము శెనగలు 2 గ్లాసులు(సోల గ్లాసు)
  2. పెద్ద ఉల్లిపాయలు 2
  3. పచ్చి మిరపకాయలు 4/5
  4. ఆవాలు ఒక చెంచా
  5. మినప్పప్పు 1 1/2 చెంచా
  6. జీలకర్ర ఒక చెంచా
  7. ఇంగువ అర చెంచా
  8. పసుపు 2 చిటికెళ్లు
  9. ఎందుమిరపకాయ ముక్కలు 2 చెంచాలు/(ఎండుమిర్చి ని కచపచ్చగా దంచి కూడా వెయ్యచ్చు)
  10. కరివేపాకు 3 రెమ్మలు
  11. ఉప్పు ఒక చెంచా(మీ రుచిని బట్టి )
  12. నూనె 250 గ్రా(అవసరాన్ని బట్టి వాడాలి)
  13. కమ్మటి నెయ్యి 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  2. శెనగల్ని కడిగి మిక్సీ లో వేసి,ఉప్పు కొద్దిగా వేసి మెత్తగా రుబ్బాలి. కానీ నీరు వేయకూడదు. (నీరుంటే వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది .చేతులు బాగా నొప్పి చేస్తాయి).రుబ్బిన ముద్దని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు వెడల్పాటి లోతున్న,మందంగా ఉన్న మూకుడు పొయ్యిమీద పెట్టి ,2 పెద్దగరిటల నూని వెయ్యాలి..
  4. నూనె వేడెక్కాక...వరుసగా ఒక దాని తరువాత ఒకటిగా ఆవాలు,జీలకర్ర ,మినప్పప్పు, ఇంగువ,ఎండు మిరపకాయ ముక్కలు,కరివేపాకు,పచ్చిమిరప ముక్కలు,పసుపు వేసి కమ్మగా వేయించాలి.
  5. పోపు వేగాక ఉల్లిపాయముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి మగ్గనివ్వాలి.
  6. 3 నిమిషాలు ఉల్లిపాయముక్కలు వేగాక మంట చిన్నది చేసి, రుబ్బి పెట్టిన శెనగల ముద్దని కూడా వేసి పోపు అంతా ముద్దలా కలిసేలా బాగా కలపాలి .
  7. ఇక చిన్న మంట మీదే ఉంచి.... ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త నూని వేస్తూ, మూకుడు కి అంటుకున్న పిండిని కూడా ముద్దలో కలిసేలా కలుపుతూ ఉండాలి.
  8. ఇలా కాసేపు కలిపి ,మళ్ళీ గరిటెడు నూని వేస్తూ,,పెద్ద ముద్దలుగా ఏమైనా ఉంటే వాటిని అట్లకాడతో విడగొడుతూ మొత్తం పిండిని వేయిస్తూవుండాలి.
  9. ఇలా కొంతసేపటికి పిండి అంతా పచ్చి వాసన పోయి,బాగా వేగి విడివిడిలాడుతూ కమ్మటి వాసన వస్తుంది.
  10. ఇప్పుడు 2 చెంచాల నెయ్యి వేసి బాగా కలిపి మంట కట్టేసి....పాత్ర లోకి తీసుకోవాలి.ఈ లోగా వేడి వేడి అన్నం రెడీ గా ఉంచుకోవడం మర్చిపోవద్దు.
  11. అంతే నోరూరించే పాఠోళీ తినడానికి సిధ్ధం అయినట్టే...వేడి వేడి అన్నంలో తాజా వెన్న ముద్ద గానీ‌ ,కమ్మటి నెయ్యి గానీ వేసుకుని ఈ పాఠోళీ కలుపుకుని ,మధ్య మధ్యలో పులసు తో ఒక ముద్ద తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర