హోమ్ / వంటకాలు / చింతతొక్కు పచ్చడి

Photo of chintatokku pachhadi by Kavitha Perumareddy at BetterButter
379
9
0.0(0)
0

చింతతొక్కు పచ్చడి

Aug-29-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతతొక్కు పచ్చడి రెసిపీ గురించి

ఈ చింతతొక్కు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ...విటమిన్ సి అందుతుంది.కీళ్లుతోందరగా అరిగి పోకుండా ఉండడానికి సహకరిస్తుంది ...పూర్వంమన పెద్దలు వీలైనంత ఎక్కువగా తరచుగా తినేవాళ్ళు .అందుకే వాళ్లకు ఏకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఉండేవి కాదు .ముడిచింతతొక్కు తో రకరకాలుగా పచ్చళ్ళు చేసుకొని తినేవాళ్ళు ...జ్వరం వచ్చి తగ్గిపోయిన తరువాత నోటికి ఏదీ రుచించదు అలాంటప్పుడు దీన్ని తింటే నోరు బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగా అరిగి ఆకలి కూడా పెరుగుతుంది .బాలింతలకు వెల్లుల్లి ఎండుమిర్చి కలిపి దంచి తినిపిస్తే మంచిది శరీరం తొందరగా కోలుకుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. నిలువ చింతతొక్కు కప్
  2. పచ్చిమిర్చి 15
  3. వెల్లుల్లి 6 రెబ్బలు
  4. జీలకర్ర స్పున్
  5. కరివేపాకు కొద్దిగా
  6. పోపుగింజెలు స్పున్
  7. నూనె 2 స్పూన్స్
  8. ఎండుమిర్చి పోపుకు 3

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండిపెట్టి స్పున్ నూనె వేసి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి .
  2. ఇప్పుడు రొటిలో ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి వేసి దంచి తరువాత ముడి చింతతొక్కు కూడా వేసి అంతా కలిసేలా దంచుకోవాలి .ఉప్పు అవసరం లేదు చింతతొక్కు లో ఉంటుంది.
  3. తరువాత బాండీలో స్పూన్ నూనె వేసి పోపుగింజెలు, కరేపాకు, ఎండుమిర్చి తో పోపు వేసి పచ్చడి వేసి కలపాలి .అంతే చాలా సులభం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర