బొబ్బట్లు | Stuffed sweet bread/sweet parotha. Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed sweet bread/sweet parotha. recipe in Telugu,బొబ్బట్లు, Swapna Sashikanth Tirumamidi
బొబ్బట్లుby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

26

0

బొబ్బట్లు వంటకం

బొబ్బట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed sweet bread/sweet parotha. Recipe in Telugu )

 • శెనగ పప్పు 1/4 కిలో
 • తియ్యని బెల్లం తురుము 1/4 కిలో
 • యాలకులపొడి 1 స్పూన్
 • మైదా 150 గ్రా
 • గోధుమపిండి 150గ్రా
 • పెసరపిండి(చాయ పెసర పప్పు మిల్ అందించిన మెత్తని పిండి)100గ్రా
 • నెయ్యి 100 గ్రా
 • సాల్ట్ రుచికి చిటికెడు

బొబ్బట్లు | How to make Stuffed sweet bread/sweet parotha. Recipe in Telugu

 1. ముందు శెనగ పప్పు కడిగి తగిన నీరుపోసి కుక్కర్ లో 3 విజిల్స్ రనివ్వాలి.
 2. ఇప్పుడు మైదా,గోధుమ పిండి చిటికెడు ఉప్పువేసి..పూరి పిండిలా కలుపుకొని కొద్దిగా నూనె రాసి మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టాలి.
 3. ఈలోగా కుక్కర్ మూత తీసి శెనగపప్పు బద్ద మెత్తగా అయిందోలేదో చూసి , నీరు లేకుండా వార్చి ఉంచాలి.
 4. ఇప్పుడు మూకుడు మీడియం మంట మీద పెట్టి బెల్లం వేసి పావుకప్పు నీళ్లు వేసి బెల్లం కరిగించాలి..ఇప్పుడు సెంగపప్పును బద్దలు లేకుండా మెదిపి పాకంలో వేసి కలపాలి...
 5. ఇప్పుడు పిండి కొద్దిగా పలుచబడు తుంది.ఇప్పుడు నెయ్యి కొద్దిగా, పెసరపిండిని వేసి బాగాకలిపి 5 నుంచి 10 నిముషాల్లో పిండి చేతికి అంటకుండా ఉండ అయ్యే స్టేజీకి వస్తుంది .
 6. ఇప్పుడు యాలకుల పొడి కలిపి పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసి వేరే పళ్ళెం లో పెట్టి ఆరిపోకుండా మూత ఉంచాలి.
 7. ఇప్పుడు పూరి ముద్దని తీసుకుని బాగా మెదిపి పూర్ణం సైజ్ ఉండలు చేసుకుని పక్కన మూత వేసి ఉంచాలి.
 8. ఇప్పుడు వత్తుకోడానికి కొద్దిగా పొడి గోధుమ పిండిని పక్కన పెట్టుకుని ఒక పూరి ముద్దని కొద్దిగా చేత్తోవత్తి మధ్యలో పూర్ణం పెట్టి జాగర్తగా అన్ని వైపులా మూసి వుండచేసి పొడిపిండి సాయంతో పలుచగా వత్తుకోవాలి .
 9. పొయ్యిమీద పెనంపెట్టి వేడిచేసి చిన్న మంట లో ఉంచి వత్తిన బొబ్బట్టుని పెనంమీద వేసి నెయ్యి రాస్తూ అంచులు అట్లకాడతో వత్తుతూ కాల్చుకోవాలి ...
 10. ఇది కాల్చేటపుడు పుల్కా లా పొంగినట్టుగా పొంగాలి. ఇలాగే నాలుగేసి చప్పున వత్తుకుని కాల్చుకుంటూ ఉండాలి.
 11. కాలిన వాటి మీద మళ్లా కాస్త నెయ్యిరాసి కాసరోల్ లోకి తీసుకోవాలి.
 12. ఇది పద్దతి ఇల్లు వళ్ళు నూని అవకుండా నీట్ గా బొబ్బట్లు రెడి అవుతాయి.
 13. ఇక వేడి వేడి బొబ్బట్లు తినడానికి సిద్ధం.

నా చిట్కా:

తోపు పిండి గానీ, పూర్ణం గానీ ఎప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలి.అప్పుడు ఈజీగా వత్తబడతాయి.

Reviews for Stuffed sweet bread/sweet parotha. Recipe in Telugu (0)