హోమ్ / వంటకాలు / బొబ్బట్లు

Photo of Stuffed sweet bread/sweet parotha. by Swapna Tirumamidi at BetterButter
572
12
0.0(0)
0

బొబ్బట్లు

Aug-29-2018
Swapna Tirumamidi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్లు రెసిపీ గురించి

బొబ్బట్లు తెలియని వారుండరు...ఇప్పుడు స్వీటు షాపుల్లోకూడా విరివిగా దొరుకుతున్నాయి..ప్రతి ఇంట్లో పండుగ,పెళ్లి,పూజ...ఇలా ప్రతి చిన్న పెద్ద శుభకార్యాలకు బొబ్బట్లు చేయడం సంప్రదాయంగా వస్తోంది.కానీ చాలా మందికి ఇవి చెయ్యడం ఒక పెద్ద సమస్యగా ఉంటుంది...పూర్ణం, తోపు పిండి కుదరకపోడం అవుతూ ఉంటుంది.అందుకని నేను చిన్న మార్పులతో కొద్దిగా సులువుగా అయ్యే విధానం చెపుతున్నా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 6

  1. శెనగ పప్పు 1/4 కిలో
  2. తియ్యని బెల్లం తురుము 1/4 కిలో
  3. యాలకులపొడి 1 స్పూన్
  4. మైదా 150 గ్రా
  5. గోధుమపిండి 150గ్రా
  6. పెసరపిండి(చాయ పెసర పప్పు మిల్ అందించిన మెత్తని పిండి)100గ్రా
  7. నెయ్యి 100 గ్రా
  8. సాల్ట్ రుచికి చిటికెడు

సూచనలు

  1. ముందు శెనగ పప్పు కడిగి తగిన నీరుపోసి కుక్కర్ లో 3 విజిల్స్ రనివ్వాలి.
  2. ఇప్పుడు మైదా,గోధుమ పిండి చిటికెడు ఉప్పువేసి..పూరి పిండిలా కలుపుకొని కొద్దిగా నూనె రాసి మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టాలి.
  3. ఈలోగా కుక్కర్ మూత తీసి శెనగపప్పు బద్ద మెత్తగా అయిందోలేదో చూసి , నీరు లేకుండా వార్చి ఉంచాలి.
  4. ఇప్పుడు మూకుడు మీడియం మంట మీద పెట్టి బెల్లం వేసి పావుకప్పు నీళ్లు వేసి బెల్లం కరిగించాలి..ఇప్పుడు సెంగపప్పును బద్దలు లేకుండా మెదిపి పాకంలో వేసి కలపాలి...
  5. ఇప్పుడు పిండి కొద్దిగా పలుచబడు తుంది.ఇప్పుడు నెయ్యి కొద్దిగా, పెసరపిండిని వేసి బాగాకలిపి 5 నుంచి 10 నిముషాల్లో పిండి చేతికి అంటకుండా ఉండ అయ్యే స్టేజీకి వస్తుంది .
  6. ఇప్పుడు యాలకుల పొడి కలిపి పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసి వేరే పళ్ళెం లో పెట్టి ఆరిపోకుండా మూత ఉంచాలి.
  7. ఇప్పుడు పూరి ముద్దని తీసుకుని బాగా మెదిపి పూర్ణం సైజ్ ఉండలు చేసుకుని పక్కన మూత వేసి ఉంచాలి.
  8. ఇప్పుడు వత్తుకోడానికి కొద్దిగా పొడి గోధుమ పిండిని పక్కన పెట్టుకుని ఒక పూరి ముద్దని కొద్దిగా చేత్తోవత్తి మధ్యలో పూర్ణం పెట్టి జాగర్తగా అన్ని వైపులా మూసి వుండచేసి పొడిపిండి సాయంతో పలుచగా వత్తుకోవాలి .
  9. పొయ్యిమీద పెనంపెట్టి వేడిచేసి చిన్న మంట లో ఉంచి వత్తిన బొబ్బట్టుని పెనంమీద వేసి నెయ్యి రాస్తూ అంచులు అట్లకాడతో వత్తుతూ కాల్చుకోవాలి ...
  10. ఇది కాల్చేటపుడు పుల్కా లా పొంగినట్టుగా పొంగాలి. ఇలాగే నాలుగేసి చప్పున వత్తుకుని కాల్చుకుంటూ ఉండాలి.
  11. కాలిన వాటి మీద మళ్లా కాస్త నెయ్యిరాసి కాసరోల్ లోకి తీసుకోవాలి.
  12. ఇది పద్దతి ఇల్లు వళ్ళు నూని అవకుండా నీట్ గా బొబ్బట్లు రెడి అవుతాయి.
  13. ఇక వేడి వేడి బొబ్బట్లు తినడానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర