కిచిడి | kichidi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • kichidi recipe in Telugu,కిచిడి, Kavitha Perumareddy
కిచిడిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

కిచిడి వంటకం

కిచిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make kichidi Recipe in Telugu )

 • బియ్యము ఒక కప్
 • పెసరపప్పు పావు కప్
 • టమాటా 2
 • పచ్చిమిర్చి 3
 • బంగాళదుంప 1
 • ఉల్లిపాయ 1
 • క్యారెట్ 1
 • దొండకాయలు 4
 • క్యాప్సికం 1
 • క్యాలిప్లవర్ కొద్దిగా
 • బీన్స్ 4
 • చిక్కుడుకాయ లు 4
 • నెయ్యి లేదా నూనె 2 స్పూన్స్
 • పోపుగింజెలు స్పున్
 • ఉప్పు తగినంత
 • కరివేపాకు కొద్దిగా
 • కొత్తిమీర కొద్దిగా
 • పోపుకు ఎండుమిర్చి 3

కిచిడి | How to make kichidi Recipe in Telugu

 1. ముందుగా బియ్యము, పెసరపప్పు కడిగి గిన్నెలో నానబెట్టుకోవాలి.
 2. కూరగాయలు అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి .
 3. ఇప్పుడు పోయిమీద ఒక గిన్నె పెట్టి నూనె వేసి పోపుగింజెలు ఎండుమిర్చి వేసి వేగినటారువాత కూరగాయ ముక్కలు అన్ని వేసి తగినంత ఉప్పుకుడా వేసి కలిపి మూతపెట్టి కాసేపు మగ్గించాలి .
 4. ఇప్పుడు మగ్గిన కూరగాయలు కు 4 కప్స్ నీళ్లు వేసి మరిగించాలి . మరుగుతున్న నీటిలో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి .
 5. కొంచెం ఉడికిన తరువాత మంట తగ్గించి చిన్న మంటమీద మగ్గించాలి .చివరగా కరేపాకు కొత్తిమీర వేసి కలిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
 6. అంతే చాలా రుచికరమైన ,బలవర్ధకమైన కిచిడి లంచ్ కు సిద్ధం .

నా చిట్కా:

ఈ వంటకు నీరు ఎక్కువగా నే పడుతుంది .1 కప్ బియ్యం ఐతే నాలుగు కప్ లు నీళ్లు వేసుకోవాలి.ఎందుకంటే కూరగాయలు బాగా ఉడకాలి.

Reviews for kichidi Recipe in Telugu (0)