BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కిచిడి

Photo of kichidi by Kavitha Perumareddy at BetterButter
0
8
0(0)
0

కిచిడి

Aug-30-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కిచిడి రెసిపీ గురించి

ఈ కిచిడి లో కూరగాయలు కలిపి చేస్తాము ...ఇంకా వేరే కూరలు అవసరం లేదు .లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా చేయచ్చు.పిల్లలు అన్ని కూరలు తినరు. ఇలా చేస్తే ఇష్టంతో తింటారు .విటమిన్లు అన్ని బాగా అందుతాయి .మనకు అన్ని తింటున్నారు అనే తృప్తి :relaxed:.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యము ఒక కప్
  2. పెసరపప్పు పావు కప్
  3. టమాటా 2
  4. పచ్చిమిర్చి 3
  5. బంగాళదుంప 1
  6. ఉల్లిపాయ 1
  7. క్యారెట్ 1
  8. దొండకాయలు 4
  9. క్యాప్సికం 1
  10. క్యాలిప్లవర్ కొద్దిగా
  11. బీన్స్ 4
  12. చిక్కుడుకాయ లు 4
  13. నెయ్యి లేదా నూనె 2 స్పూన్స్
  14. పోపుగింజెలు స్పున్
  15. ఉప్పు తగినంత
  16. కరివేపాకు కొద్దిగా
  17. కొత్తిమీర కొద్దిగా
  18. పోపుకు ఎండుమిర్చి 3

సూచనలు

  1. ముందుగా బియ్యము, పెసరపప్పు కడిగి గిన్నెలో నానబెట్టుకోవాలి.
  2. కూరగాయలు అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి .
  3. ఇప్పుడు పోయిమీద ఒక గిన్నె పెట్టి నూనె వేసి పోపుగింజెలు ఎండుమిర్చి వేసి వేగినటారువాత కూరగాయ ముక్కలు అన్ని వేసి తగినంత ఉప్పుకుడా వేసి కలిపి మూతపెట్టి కాసేపు మగ్గించాలి .
  4. ఇప్పుడు మగ్గిన కూరగాయలు కు 4 కప్స్ నీళ్లు వేసి మరిగించాలి . మరుగుతున్న నీటిలో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి .
  5. కొంచెం ఉడికిన తరువాత మంట తగ్గించి చిన్న మంటమీద మగ్గించాలి .చివరగా కరేపాకు కొత్తిమీర వేసి కలిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
  6. అంతే చాలా రుచికరమైన ,బలవర్ధకమైన కిచిడి లంచ్ కు సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర