దక్షిణ భారతీయ తాలీ | Rice..alu fry..coconutchutny..rotiand buttermilk Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice..alu fry..coconutchutny..rotiand buttermilk recipe in Telugu,దక్షిణ భారతీయ తాలీ , Shobha.. Vrudhulla
దక్షిణ భారతీయ తాలీ by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

దక్షిణ భారతీయ తాలీ వంటకం

దక్షిణ భారతీయ తాలీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice..alu fry..coconutchutny..rotiand buttermilk Recipe in Telugu )

 • బంగాళా దుంపలు వేపుడు కి 1/2 కిలో
 • ఉప్పు , కారం రుచికి సరిపడ
 • పోపు మగ్గిగ కి : మజ్జిగ 3 కప్పులు
 • ఉప్పు రుచికి తగినంత
 • చిటికెడు పసుపు
 • పచ్చి మిర్చి రెండు
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • అవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • వాము 1/2 చెంచా
 • నూనె 2 చెంచాల
 • కొబ్బరి పచ్చడి కావలసిన పదార్థాలు :
 • పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు
 • మినపప్పు 3 చెంచాలు
 • శనగపప్పు 3 చెంచాలు
 • ఎండు మిరపకాయలు 6
 • మెంతులు చిటికెడు
 • ఇంగువ చిటికెడు
 • కరివేపాకు నాలుగు రెమ్మలు
 • నూనె 4 చెంచాలు

దక్షిణ భారతీయ తాలీ | How to make Rice..alu fry..coconutchutny..rotiand buttermilk Recipe in Telugu

 1. ముందుగా దుంపలు వేపుడు కి , దుంపలు శుభ్రం చేసుకొని ఉప్పు నీళ్లలో వేసుకొని ఐదు నిమిషాలు ఉంచండి .
 2. తరువాత తొక్క తీయకుండా మీకు నచ్చిన ఆకారంలో తరిగి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో వేసి మరలా ఒక రెండు నిమిషాలు ఉంచండి .
 3. ఇప్పుడు ముక్కలును వడకట్టి రెండు నిమిషాలు చిల్లుల జల్లెడలో వేసుకోండి
 4. ఇప్పుడు స్టవ్ మీద ఇనప మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కక అందులో ముక్కలు వేసి కాస్త వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టాలి.
 5. కాసేపు వేగాక చిటికెడు పసుపు , ఒక చెంచా కారం వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయటమే .అంతే కరకరలాడే వేపుడు రెడీ .
 6. ఇప్పుడు పోపు మజ్జిగ విధానము :
 7. ముందుగా పుల్లటి పెరుగుకని చిలికి మజ్జిగ తయారు చేసుకోవాలి.
 8. ఇప్పుడు స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసుకోండి
 9. నూనె వేడెక్కాక అందులో ఆవాలు ,జీలకర్ర, వాము, ఇంగువ, పసుపు,కరివేపాకు , పచ్చి మిర్చి నిలువుగా తరిగి వేసుకొని పోపు చేసుకోండి
 10. ఇవన్నీ వేసి వేగాక కిందకు దించి కాస్త చల్లార్చుకొని చిలికి పెట్టుకున్న మజ్జిగ లో వేసుకోండి . పోపు వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ లో వేస్తె పెరుగు విరిగే అవకాశం ఉంటుంది .
 11. ఇప్పుడు ఆ మజ్జిగలో ఉప్పు వేసి బాగా కలిపి కాస్త బాగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడటానికి కూడా అందంగా ఉంటుంది.అంతే పోపు మజ్జిగ తయారు.
 12. ఇప్పుడు కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం :
 13. ముందుగా పచ్చి కొబ్బరి కోరి తయారుగా ఉంచుకోవలెను
 14. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి వేడయ్యాక నూనె వేసి అందులో మిన పప్పు,శనగపప్పు,ఇంగువ,మెంతులు,కరివేపాకు,ఎండు మిరపకాయలు వేసి చక్కగా వేగనివ్వాలి
 15. బాగా వేగిన తరువాత ఇవన్నీ కాస్త చల్కర్చుకొని మిక్సి లో వేసి , కొబ్బరి కోరు కూడా వేసి వాటికి తగినంత ఊపు , చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి .
 16. రుబ్బిన దానిని ఒక గిన్నెలో తీసుకొని దానికి కావాలనుకుంటే అవ్వాలి, జీలకర్ర, మిన పప్పు, చినిగె పప్పు మరియు ఇంగువ తో పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
 17. మిరపకాయలు తినే అలవాటు ఉన్నవాళ్లు వేయించిన మిరపకాయలు వేరేగా కూడా వుంచుకోవచ్చు ఆన్నాముతో పచ్చడి కలిపి తినేటప్పుడు యి మిరపకాయలు నాన్చుకొని తింటే ఆహా ఎంత రుచిగానో ఉంటుంది.
 18. యి పచ్చడి అన్నాముతో రోటి తో కూడా తినొచ్చు .
 19. ఉడికించిన అన్నం, కొబ్బరి పచ్చడి , బంగాళా దుంప వేపుడు , పోపు మజ్జిగా , అప్పడాల తో తేలికైన దక్షిణ భారతీయ తాలి రెడీ .

Reviews for Rice..alu fry..coconutchutny..rotiand buttermilk Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo