ఎర్ర గోధుమ రవ్వ పులవ్ | Wheat ravva pulav Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wheat ravva pulav recipe in Telugu,ఎర్ర గోధుమ రవ్వ పులవ్, Lalitha Kandala
ఎర్ర గోధుమ రవ్వ పులవ్by Lalitha Kandala
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ఎర్ర గోధుమ రవ్వ పులవ్ వంటకం

ఎర్ర గోధుమ రవ్వ పులవ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheat ravva pulav Recipe in Telugu )

  • ఎర్ర గోధుమ రవ్వ 1 కప్
  • పులావ్ మసాలా 1 స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • ఇలాయిచీలు 2
  • లవంగాలు 4
  • దాల్చిన చెక్క 1/2 అంగుళం ముక్క
  • ఉల్లిపాయలు 1
  • క్యారెట్ 1
  • బీన్స్ 10
  • బంగాళా దుంపలు 2
  • పచ్చి బఠాని 1/2 కప్
  • కాలీ ఫ్లవర్ 1 కప్
  • గరం మసాలా పొడి 1/2 స్పూన్
  • ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్

ఎర్ర గోధుమ రవ్వ పులవ్ | How to make Wheat ravva pulav Recipe in Telugu

  1. ముందుగా ఒక పాన్ లో కొంచెము నెయ్యి గాని, వెన్న కానీ వేసి యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి ఇంకా మీకు నచ్చిన మసాలాలు వేసి బాగా వేయించాలీ
  2. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక ఉల్లిపాయలు, చిల్లి, క్యారెట్ , బీన్స్, కాలీఫ్లవర్, బఠాని వంటి కూరగాయ ముక్కలు వేసి బాగా కలపాలి
  3. 2 నిమిషాలు అయ్యాక పులావ్ మసాలా పౌడర్, గరం మసాలా, నచ్చితే ధనియా జీరా పౌడర్ వేసి 2 కప్స్ నీళ్లు పోసి, ఉప్పు వేసి, బాగా మరిగనివ్వాలి
  4. మరిగిన తరువాత 1 కప్ పెద్ద గోధుమ నూక వేసి కలిపి ఉడకనివ్వాలి.
  5. ఉడికి , దెగ్గర పడ్డాక వడ్డించుకోవాలి .

Reviews for Wheat ravva pulav Recipe in Telugu (0)