మొలకల గారెలు | SPROUT WADA Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SPROUT WADA recipe in Telugu,మొలకల గారెలు, Sandhya Rani Vutukuri
మొలకల గారెలుby Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  36

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

మొలకల గారెలు వంటకం

మొలకల గారెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SPROUT WADA Recipe in Telugu )

 • మొలకల శెనగలు 3 కప్స్
 • 3/4 పచ్చి మిర్చి
 • పుదీనా 1 /4 కప్
 • కరివేపాకులు 4
 • అల్లం ముక్క 1 అంగుళం
 • 2 వెల్లుల్లి రెబ్బలు
 • జీలకఱ్ఱ 2 చెంచాలు
 • ఉల్లి తరుగు 1/2 కప్పు
 • చాట్ మసాలా చిటికెడు
 • నూనె 3 కప్పులు (వేయించడానికి)
 • ఉప్పు 1 చెంచా

మొలకల గారెలు | How to make SPROUT WADA Recipe in Telugu

 1. 2 రోజుల ముందు నల్ల శెనగలు కడిగి ఒక రాత్రి అంతా నాన పెట్టండి.
 2. నాని న శెనగలు ఒక రోజు మూట కట్టి మొలకలు తెప్పించండి.
 3. అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, సరిపోయే పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి ,మిక్సీ పట్టుకోవాలి.
 4. ఈ ముద్ద కు శెనగలు,జీలకర్ర,కొంచెం సన్నగా తరిగిన పుదీనా,కరివేపాకులు వేసి మళ్ళీ రుబ్బుకొని తీయాలి.
 5. మూకుడు లో నూనె వేసి కాగాక, రుబ్బుకున్న ముద్ద ను గారె ల్లాగ చేసి తీయండి.
 6. చిన్నారుల కైతే లాలి పాపు లాగా పుల్ల కు కుచ్చి డబ్బాలో పెట్టండి.
 7. పెద్ద పిల్లలకైతే గారె ల పైన ఉల్లి తరుగు చల్లి, చాట్ మసాలా తో డబ్బా ఇవ్వండి.

Reviews for SPROUT WADA Recipe in Telugu (0)