హోమ్ / వంటకాలు / మొలకల గారెలు

Photo of SPROUT WADA by Sandhya Rani Vutukuri at BetterButter
104
4
0.0(0)
0

మొలకల గారెలు

Sep-01-2018
Sandhya Rani Vutukuri
2160 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకల గారెలు రెసిపీ గురించి

సాధారణంగా అమ్మ లందరూ పిల్లల కు యే రకంగా పౌష్టికాహారం ఇవ్వాలా అని ఆలోచిస్తూ వుంటారు. నేను మొలకలెత్తిన శెనగల తో వడ లు చేసి మీతో పంచుకుంటున్నాను. అయితే ఈ వడ లు చాలా చిన్న పిల్లల డబ్బాల్లోకి అయితే టూత్పిక్ తో ఇస్తే లాలి పాప్ లాగా ఇవ్వాలి. టీన్ ఏజ్ వాళ్ల కైతే చాట్ మసాలా పచ్చి ఉల్లిపాయ లతో ఇస్తే సరదాగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మొలకల శెనగలు 3 కప్స్
  2. 3/4 పచ్చి మిర్చి
  3. పుదీనా 1 /4 కప్
  4. కరివేపాకులు 4
  5. అల్లం ముక్క 1 అంగుళం
  6. 2 వెల్లుల్లి రెబ్బలు
  7. జీలకఱ్ఱ 2 చెంచాలు
  8. ఉల్లి తరుగు 1/2 కప్పు
  9. చాట్ మసాలా చిటికెడు
  10. నూనె 3 కప్పులు (వేయించడానికి)
  11. ఉప్పు 1 చెంచా

సూచనలు

  1. 2 రోజుల ముందు నల్ల శెనగలు కడిగి ఒక రాత్రి అంతా నాన పెట్టండి.
  2. నాని న శెనగలు ఒక రోజు మూట కట్టి మొలకలు తెప్పించండి.
  3. అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, సరిపోయే పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి ,మిక్సీ పట్టుకోవాలి.
  4. ఈ ముద్ద కు శెనగలు,జీలకర్ర,కొంచెం సన్నగా తరిగిన పుదీనా,కరివేపాకులు వేసి మళ్ళీ రుబ్బుకొని తీయాలి.
  5. మూకుడు లో నూనె వేసి కాగాక, రుబ్బుకున్న ముద్ద ను గారె ల్లాగ చేసి తీయండి.
  6. చిన్నారుల కైతే లాలి పాపు లాగా పుల్ల కు కుచ్చి డబ్బాలో పెట్టండి.
  7. పెద్ద పిల్లలకైతే గారె ల పైన ఉల్లి తరుగు చల్లి, చాట్ మసాలా తో డబ్బా ఇవ్వండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర