హోమ్ / వంటకాలు / కాకరకాయ వేపుడు

Photo of Kaakara kaaya vepudu by Kavitha Perumareddy at BetterButter
694
4
0.0(0)
0

కాకరకాయ వేపుడు

Sep-01-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ వేపుడు రెసిపీ గురించి

అప్పుడప్పుడు కాకరకాయను కూడా భోజనంలో తినాలి.వారంలో ఒకసారి ఐనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చెక్కరవ్యాది కి చాలా మంచిది. షుగర్ అదుపులో ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. కాకరకాయలు అరకేజీ
  2. ఉల్లిపాయ పెద్దది 1
  3. నూనె 3 స్పూన్స్
  4. పోపుగింజెలు స్పున్
  5. కారం చిన్న స్పున్
  6. ఉప్పు తగినంత
  7. పసుపు కొద్దిగా
  8. ధనియాలపొడి 1 స్పున్
  9. కరేపాకు కొద్దిగా
  10. కొత్తిమీర కొద్దిగా
  11. కొబ్బరి వెల్లుల్లి కలిపి చేసిన పొడి 3 స్పూన్స్
  12. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా కాకరకాయ లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి 10 నిముషాలు ఉంచాలి
  2. తరువాత కాకరకాయ ముక్కలు నీరు లేకుండా బాగా పిండి ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  3. ఇపుడు పోయిమీద ఒక మందపాటి బాండీ పెట్టి నూనెవేసి వేడి ఐన తరువాత పోపుగింజెలు వేసి వేగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపును వేసి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి.లేకపోతే మాడిపోతుంది.
  4. సగం మగ్గిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి బాగా మగ్గే వరకు ఉంచాలి.
  5. ఇప్పుడు కూర మగ్గిన తర్వాత కారం, కొబ్బరిపొడి,ధనియాలపొడి ,కరివేపాకు, కొత్తిమీర ,నిమ్మకాయ రసం వేసి అంతా కలిపి 5 నిముషాలు ఉంచాలి.
  6. అంతే ఇంకా వేడివేడిగా కాకరకాయ వేపుడు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర