మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్) | Methy Mashroom curry(hotel style) Recipe in Telugu

ద్వారా Pranavee Ganti  |  2nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Methy Mashroom curry(hotel style) recipe in Telugu,మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్), Pranavee Ganti
మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్)by Pranavee Ganti
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్) వంటకం

మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methy Mashroom curry(hotel style) Recipe in Telugu )

 • మష్రూమ్/ పుట్ట గొడుగులు 1 1/2 కప్పులు
 • మెంతి కూర చిన్న కట్ట
 • పెరుగు 1 కప్
 • 1/2 స్పూన్ గరం మసాలా పొడి
 • కారం 1 స్పూన్
 • ఉప్పు 1 స్పూన్
 • కొత్తిమీర కొద్దిగా
 • ఉల్లిపాయ 1
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
 • పసుపు కొద్దిగా

మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్) | How to make Methy Mashroom curry(hotel style) Recipe in Telugu

 1. ముందుగా ఒక బౌల్ లో కప్ పెరుగు వేసి దాన్లో 1/2స్పూన్ గరం మసాలా పొడి , 1 స్పూన్ కారం,1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ పెరుగులో కప్ మెంతి కూర ఆకులు, కట్ చేసిన మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కనపెట్టాలి .
 2. స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వెయ్యాలి.
 3. తర్వాత ఉల్లిముక్కలు, పసుపు వెయ్యాలి.
 4. వేగిన ఉల్లిముక్కల్లో 1/2 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
 5. తర్వాత పెరుగులో నానపెట్టినవి వేసి బాగా కలపి మూత పెట్టాలి.
 6. కూరలో ఉన్న నీరు దగ్గరపడే వరకు ఉంచుకొని స్టవ్ అపాలి.
 7. ఎంతో రుచిగా వుండే మేథి మష్రూమ్ కూర పరోట,చపాతీ,పూరి తో తినటానికి సిద్ధం.

Reviews for Methy Mashroom curry(hotel style) Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo