పాలకాయలు/వెన్నవుండలు | Pala kayalu/.Butter balls Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  3rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pala kayalu/.Butter balls recipe in Telugu,పాలకాయలు/వెన్నవుండలు, Swapna Tirumamidi
పాలకాయలు/వెన్నవుండలుby Swapna Tirumamidi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పాలకాయలు/వెన్నవుండలు వంటకం

పాలకాయలు/వెన్నవుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pala kayalu/.Butter balls Recipe in Telugu )

 • మెత్తని వరిపిండి 1 కప్పు
 • వాము 1 చెంచా
 • మినప పిండి 1 చెంచా(చాయమినపప్పు మిల్ పట్టించింది)
 • బటర్ 100 గ్రా(అమూల్ బటర్ వాడాను.)
 • తెల్ల నువ్వులు అర చెంచా(అవసరం అనుకుంటే)నేను వేసాను.
 • చియా సీడ్స్ అరచెంచా (అవసరమైతే)నేను వేసాను మంచిదని +,కొత్తదనం కోసం.
 • ఉప్పు 1 చెంచా
 • చిటికెడు ఇంగువపొడి.
 • వేయించడాని నూనె....1/2 లీటర్

పాలకాయలు/వెన్నవుండలు | How to make Pala kayalu/.Butter balls Recipe in Telugu

 1. ముందుగా వరిపిండి ని జల్లించి మెత్తని పిండిని తీసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి.
 2. అందులో బటర్ ని కరిగించి పిండిలో వేసి మొత్తం కలిసేలా చేతితో బాగా కలపాలి.
 3. అందులో ఇప్పుడు ఉప్పు,వాము,నువ్వులు,చియసీడ్స్,ఇంగువ...వేసి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా గట్టిగా,చేతికి అంటుకోకుండా ఉండేలా కలుపుకోవాలి మూత పెట్టి ఉంచాలి.
 4. ఇప్పుడు వేయించడానికి మూకుడు పెట్టి ఆయిల్ పోసి వేడిచెయ్యాలి.మిడియం మంట కి కాస్త తక్కువగా పెట్టి ఉంచాలి.
 5. ఈ లోగా కలిపిన పిండిని 3 భాగాలు చేసి..ఒక భాగాన్ని చేతిలోకి తీసుకుని చిన్న గోళిక్కాయలంత సైజు లో గుండ్రంగా కానీ,అదే మోతాదులో సిలెండర్ ఆకారంలో కానీచేసుకొని పెట్టుకోవాలి.
 6. ఇప్పుడు నూనె లో మెల్లగా జారవిడిచి ,వెంటనే కలపకుండా ఒక నిముషం ఆగి కలిపితే విడి విడిగా అవుతాయి.అవి అలాగే సన్నమంట మీదే వేగనివ్వాలి.ఒక్కొక్క వాయ వేగడానికి 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది.
 7. బంగారు రంగు రాగానే తీసి టిష్యూ మీద వేసుకుని పెట్టుకోవాలి,మంట తగ్గించి ఉంచాలి....మొదటి వాయ వేగే లోపు రెండవ భాగం తీసుకొని ఉండలు చేసి ఉంచాలి.
 8. ఇప్పుడు రెండోవాయ ఉండలు నూనెలో వేసి,3 వ భాగాన్ని కూడా ఉండలు తయారుచేసుకోవాలి.
 9. ఎర్రగా అయ్యే వరకూ వెయిస్తే గట్టిగావుంటాయి. పెద్ద మంట వల్ల పైన వేగి, లోపల ఉడకవు. అందుకే బంగారు రంగు వచ్చినవెంటనే తీసేయాలి...ఇలా వేయించినవి చల్లారాక గాలితగలని డబ్బాలో దాచుకోవాలి.అంతే..గుల్లగా కరకర లాడే పాలకాయలు తయారు.

నా చిట్కా:

ఎక్కువమొత్తంలో చేసుకున్నప్పుడు వేరొకరి సాయంఉండాలి...ఒక్కరే చేసుకోవాలంటే తక్కువమొత్తం లోనే పని తేలిక అవుతుంది..

Reviews for Pala kayalu/.Butter balls Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo

ఇలాంటి వంటకాలు