హోమ్ / వంటకాలు / మంచూరియన్ బిరియాని

Photo of Manchurian biriyani by Sree Sadhu at BetterButter
135
7
0.0(0)
0

మంచూరియన్ బిరియాని

Sep-04-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మంచూరియన్ బిరియాని రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలు పెద్దలు లంచ్ అప్పుడు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • హైదరాబాదీ
 • చిన్న మంట పై ఉడికించటం
 • ఉడికించాలి
 • వేయించేవి
 • ప్రధాన వంటకం
 • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

 1. క్యారెట్ సన్నగా తరిగినది 1 కప్
 2. బీన్స్ సన్నగా తరిగినది 1 కప్
 3. పచ్చిమిర్చి 2-3 సన్నగా తరిగినది
 4. క్యాబేజీ సన్నగా తరిగినది 1 1/2 కప్
 5. మైదా 2-3 చెంచాలు
 6. కార్న్ ఫ్లోర్ 2-3 చెంచాలు
 7. ఉప్పు తగినంత
 8. కారం తగినంత
 9. కొత్తిమీర 4 చెంచాలు
 10. పుదినా 2 చెంచాలు
 11. బాస్మతి బియ్యం 2 కప్పులు
 12. నీళ్లు తగినంత
 13. అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
 14. గరం మసాలా 1-2 చెంచాలు
 15. ఇలాచీ 2
 16. షాజీరా 1 చెంచా
 17. దాల్చిన చెక్క 1 ఇంచ్
 18. నూనె వేయించడానికి సరిపడా
 19. టమాటో సాస్ 2 చెంచాలు
 20. సొయా సాస్ 1 చెంచా
 21. చిల్లి సాస్ 2 చెంచాలు
 22. ఉల్లిపాయ 1
 23. ఉల్లిపరక 3 చెంచాలు
 24. వెనిగర్ 1/2 చెంచా
 25. కాప్సికం 1/2 కప్
 26. బాటని 1/4 కప్
 27. పెరుగు 1/2 కప్
 28. ఆలూ 1/2 కప్

సూచనలు

 1. ముందుగా ఒక గిన్నె లో క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, క్యాబేజీ ,ఉప్పు ,కారం వేసి బాగా కలుపుకోవాలి
 2. బాగా కలిసిన తరువాత అందులో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి
 3. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసి ఉండలు వేసి ఎర్రగా వేయించాలి
 4. పక్కన పెట్టుకోవాలి
 5. తరువాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఉల్లిపాయ ,కాప్సికం వేసి వేయించాలి
 6. అందులో టమాటో సాస్ ,చిల్లి సాస్ ,సొయా సాస్ ,వెనిగర్ వేసి వేయించి కొన్ని నీళ్లు పోసి సాస్ తయారు చేసుకోవాలి
 7. అందులో మంచూరియన్ బాల్స్ వేసి రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి దాని మీద ఉల్లిపరకాలు వేసి పక్కన పెట్టుకోవాలి
 8. తరువాత బియ్యాన్ని బాగా కడిగి 30 నిమిషాలు నాన్నబెట్టుకోవాలి
 9. తరువాత స్టవ్ మీద ఒక పెద్ద మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసి దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా, నూనె వేసి నీళ్లని బాగా ఉడికించాలి
 10. ఉప్పు కూడా వేసి నీళ్లు వార్చుకోవాలి
 11. తరువాత స్టవ్ మీద మళ్ళి మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించుకోవాలి
 12. అందులో క్యారెట్, బీన్స్, మటర్ ,ఆలూ ,పచ్చిమిర్చి ,అల్లం వెల్లులి పేస్ట్ ,వేసి వేయించి అందులో ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు ,నీళ్లు పోసి కుక్కర్ విస్టల్ వచ్చే వరకు ఉంచాలి
 13. తరువాత ఒక కుక్కర్ లో కింద నెయ్యి వేసి కూర వేసి దాని మీద ఉడికిన అన్నం వేసి కొత్తిమీర, పుదీనా మంచూరియన్ ఉండలు ఆలా 2-3 లయెర్స్ వేయాలి తరువాత స్టవ్ మీద పెట్టి 15 డం చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర