హోమ్ / వంటకాలు / టమోటా పప్పు,వంకాయ టమోటా కూర,టమోటా పల్లిలా పచ్చడి,క్యాప్సికమ్ వేపుడు

Photo of Tomato pappu,Brinjal tomato curry,Tomato Groundnut chutney,Capsicum Fry by Tejaswi Yalamanchi at BetterButter
2624
4
0.0(0)
0

టమోటా పప్పు,వంకాయ టమోటా కూర,టమోటా పల్లిలా పచ్చడి,క్యాప్సికమ్ వేపుడు

Sep-04-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా పప్పు,వంకాయ టమోటా కూర,టమోటా పల్లిలా పచ్చడి,క్యాప్సికమ్ వేపుడు రెసిపీ గురించి

మా వారికి మధ్యన భోజనం.నాది నాలుగు బర్నర్ల పోయి అండి అందుకే అరగంటలో వంట అయిపోయింది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. టమోటా పచ్చడి తయారీకి పదార్థాలు
  2. పచ్చి టమోటా : 4
  3. వేయించిన పల్లిలు : 150 గ్రా.
  4. పచ్చి మిర్చి : 6
  5. నూనె : 4 చెంచాలు
  6. జీలకర్ర : 2 చెంచాలు
  7. వెల్లుల్లి : 2 రెబ్బలు
  8. చింతపండు పేస్ట్ : 1 చెంచా
  9. ఉప్పు : 1 చెంచా
  10. పచ్చడి తాలింపుకి
  11. నూనె : 2 చెంచాలు
  12. ఆవాలు : 1/2 చెంచా
  13. జీలకర్ర : 1/2 చెంచా
  14. క్యాప్సికమ్ వేపుడు తయారీకి పదార్థాలు
  15. నూనె : 3 చెంచాలు
  16. క్యాప్సికమ్ ముక్కలు : 2 కప్పులు
  17. పుట్నాల పప్పు : 3 చెంచాలు
  18. వెల్లుల్లి : 3 రెమ్మలు
  19. జీలకర్ర : 1 చెంచా
  20. కారం : 1 చెంచా
  21. ఉప్పు : 1 చెంచా
  22. టమోటా పప్పు తయారీకి పదార్థాలు
  23. టమోటాలు : 3
  24. ఉల్లిపాయలు : 2
  25. పచ్చిమిర్చి : 2
  26. ఆవాలు : 1/2 చెంచా
  27. జీలకర్ర : 1/2 చెంచా
  28. కంది పప్పు : పావు కిలో
  29. కారం : ఒక స్పూన్
  30. నూనె : 2 స్పూన్లు
  31. కర్వేపాకు : 2 రెమ్మలు
  32. వంకాయ టమోటా కూర తయారీకి పదార్దాలు
  33. వంకాయలు : 4 చిన్నవి సన్నవి
  34. టమోటాలు : 2
  35. ఉల్లిపాయ : 1
  36. పచ్చి మిర్చి : 2
  37. ఆవాలు : 1/2 చెంచా
  38. జీలకర్ర : 1/2 చెంచా
  39. కొత్తిమీర తరిగినది : 2 చెంచాలు
  40. నునె : 3 చెంచాలు
  41. ఉప్పు : 1 చెంచా
  42. కారం : 1 చెంచా

సూచనలు

  1. టమోటా పల్లిల పచ్చడి విధానం
  2. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి అది కాగాక,టమోటా ముక్కలుగా చేసి అవి వేయండి,పచ్చి మిర్చి వేయండి,వేయించండి.
  3. అవి వేగాక చివరగా జీలకర్ర,చింతపండు పేస్ట్ ,వెల్లుల్లి వేసి చాలరనివండి.
  4. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ,దానిలో పైనవి అన్ని వేసి వేయించిన పల్లిలు,ఉప్పు వేసి మెత్తగా చేస్కోండి
  5. పచ్చడి తయారు.ఇప్పుడు తాలింపు వేసుకుందాం
  6. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి అది కాగాక ఆవాలు,జీలకర్ర వేసి వేయించి ఆ తాలింపు పచ్చడి లో వేసి కలపండి
  7. అంతే టమోటా పల్లిల పచ్చడి తయారు.
  8. క్యాప్సికమ్ వేపుడు తయారీ విధానం
  9. ముందుగా బాండీ పెట్టి నూనె వేసి అది కాగాక క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక పది నిమిషాలు వేయించండి.
  10. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ,దానిలో పుట్నాల పప్పు,జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు,కారం,ఉప్పు వేసి పొడి చేస్కోండి
  11. ఈ పొడిని వేయించిన క్యాప్సికమ్ ముక్కలలో వేసి పొడియొక్క పచ్చి వాసనా పోయే దాకా వేయించండి
  12. అంతే క్యాప్సికమ్ వేపుడు తయారు.
  13. టమోటా పప్పు తయారీ విధానం
  14. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు ను కడిగి ఉంచుకోవాలి
  15. టమోటాలని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.ఉల్లిపాయ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  16. ఇప్పుడు కుకర్లో టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేయండి.ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోండి.
  17. ఉడికిన పప్పును తీసుకుని మెత్తగా మెదుపు కొండి.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో నూనె వేసి అది కాగాక జీలకర్ర ఆవాలు వేయండి
  18. ఆ నూనెని మెదిపిన పప్పు లో వేయండి. ఇప్పుడు మళ్లీ ఒకసారి గ్యాస్ వెలిగించి ఈ పప్పును దానిమీద పెట్టండి.ఇప్పుడు ఉప్పు కారం కరివేపాకు వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
  19. అంతే టమోటా పప్పు తయారు.
  20. వంకాయ టమోటా కూర తయారీ విధానం :::::
  21. ముందుగా టమోటా వంకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చిలని చిన్న ముక్కలు గా తరగండి
  22. ఇప్పుడు పోయి మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి కాగా నివండి
  23. దాంట్లో ఆవాలు జీలకర్ర వేయ్యండి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ వేయండి పచ్చి మిర్చి కూడా వెయ్యండి ఉప్పు కూడా వేసి కలపండి
  24. ఉల్లిపాయ పచ్చిమిర్చి సగం వేగాక దాంట్లో వంకాయ ముక్కలను వేయండి మగ్గ నివ్వండి
  25. ఒక 5 నిమిషాల తరవాత టమోటా ముక్కలని వేయండి.మూత పెట్టి 10 నిముషాలు ఉదకనివండి.
  26. ఇప్పుడు కారం వేయండి.ఒక నిమిషం తరవాత పోయి అపండి కొత్తిమీర వేసి దించుకోండి
  27. అంతే వంకాయ టమోటా కూర తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర