స్పాంజ్ ఇడ్లీ | Sponge idly Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sponge idly recipe in Telugu,స్పాంజ్ ఇడ్లీ, Sree Vaishnavi
స్పాంజ్ ఇడ్లీby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

స్పాంజ్ ఇడ్లీ వంటకం

స్పాంజ్ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sponge idly Recipe in Telugu )

 • బియ్యం: 3 కప్పులు
 • మినప్పప్పు: కప్పు
 • మెంతులు: టీస్పూను
 • అన్నం: అరకప్పు
 • ఉప్పు: ఒకటిన్నర టీస్పూన్లు
 • బేకింగ్‌సోడా: అరటీస్పూను

స్పాంజ్ ఇడ్లీ | How to make Sponge idly Recipe in Telugu

 1. పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి అవి మరుగుతుండగా ఆఫ్‌ చేసి అందులో కడిగిన బియ్యం వేసి మూతపెట్టకుండా ఆ నీళ్లు చల్లారేవరకూ ఉంచాలి.
 2. మినప్పప్పు, మెంతులు విడిగా నానబెట్టాలి. 
 3. బియ్యం, పప్పు కనీసం ఆరు గంటలపాటు నాననివ్వాలి. 
 4. మినప్పప్పులో మెంతులు కలిపి మెత్తగా రుబ్బాలి. 
 5. తరవాత బియ్యంలో నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బి పిండి మిశ్రమంలో కలపాలి. 
 6. బియ్యం రుబ్బేటప్పుడే అన్నం కూడా వేసి రుబ్బాలి. 
 7. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని రాత్రంతా పులియనిచ్చి ఉదయాన్నే ఉప్పు, బేకింగ్‌సోడా కలిపి ఇడ్లీ పాత్రలు వేసి సుమారు పదిహేను నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి, స్టవ్‌ ఆఫ్‌ చేశాక ఐదు నిమిషాలపాటు అలాగే ఉంచి అప్పుడు మూత తీయాలి. 

Reviews for Sponge idly Recipe in Telugu (0)