హోమ్ / వంటకాలు / పాలకూర పరాటా

Photo of Paalk paraata by Chandrika Marripudi at BetterButter
503
2
0.0(0)
0

పాలకూర పరాటా

Sep-05-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పరాటా రెసిపీ గురించి

పాలకూర,తోటకూర కలిపి పేస్ట్లా చేసి పిండిలో కలిపి చపాతీలు చేసుకోవడం. ఆకు కూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. పరాటాతో జతగా బీట్రూట్ తురుముకి బెల్లం తురిమి కలిపి కొద్దిగా జీడిపప్పు పలుకులు, కిస్మిస్ కలిపి పెట్టాను.పచ్చిదయినా కూడా హల్వా లా చాలా బాగుంటుంది. అపుడపుడయినా బీట్రూట్ పచ్చిది తింటే మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా తిని చూడండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మల్టీగ్రైన్ ఆటా : 1/4 కేజీ
  2. తోటకూర : 1కట్ట
  3. పాలకూర : 1 కట్ట
  4. ఉప్పు : తగినంత
  5. జీలకర్ర : 2స్పూన్లు
  6. అల్లం : చిన్నముక్క
  7. పచ్చిమిర్చి :5,6
  8. నూనె : 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా తోటకూర, పాలకూర శుభ్రం చేసి కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. తరిగిన ఆకుకూరని ఒక గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టి మగ్గనివ్వాలి.
  3. తరువాత దాన్ని చల్లారనివ్వాలి
  4. చల్లారాక దాన్లో అల్లం,పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సిలో పేస్ట్ చేసుకోవాలి.
  5. ఇపుడు పిండి తీసుకుని ఒక గిన్నెలో మిక్సి చేసుకున్న పేస్టు, కొద్దిగా ఉప్పు,నూనె వేసి చపాతీ పిండిలా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
  6. ఇపుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చపాతీలా వత్తుకుని పెనం పైన రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర