క్యాబేజీ పరాట | STUFFED CABBAGE ROTI Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • STUFFED CABBAGE ROTI recipe in Telugu,క్యాబేజీ పరాట, Sandhya Rani Vutukuri
క్యాబేజీ పరాటby Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

క్యాబేజీ పరాట వంటకం

క్యాబేజీ పరాట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make STUFFED CABBAGE ROTI Recipe in Telugu )

 • గోధుమ పిండి 1/4 కేజీ
 • క్యాబేజీ 1/4 కేజీ (సుమారు)
 • ఉప్పు 1 చెంచా
 • ఎర్ర కారం 1 చెంచా
 • గరం మసాలా పొడి చిటికెడు
 • నూనె 1 చెంచా
 • నీళ్లు 1 గ్లాసు
 • నెయ్యి 2 చెంచాలు
 • అల్లంవెల్లుల్లి కొంచెం

క్యాబేజీ పరాట | How to make STUFFED CABBAGE ROTI Recipe in Telugu

 1. క్యాబేజీ ని తురుము పీట పై కానీ, ఇలాంటి పీట లో కానీ చాలా సన్నగా తరగండి.
 2. పొయ్యి పై మూకుడు పెట్టి, చెంచా నూనె వేసి అల్లం వెల్లుల్లి గరం మసాలా,ఉప్పు కారంతో క్యాబేజి కూర చేసి చల్లార నివ్వండి.
 3. గోధుమపిండి ని తీసుకొని ఉప్పు లేకుండా చపతిలకు పిండి ని తడుపు కొని 20 ని.లు నాన నివ్వండి.
 4. పిండి ని పూరి కి కావాల్సిన సైజు లో ఉండలు చేసి,12 పూరీలు వొత్తుకోవాలి. (6 పరాటాలు కోసం)
 5. ఒక పూరి ని తీసుకొని, 1 చెంచా కూర పెట్టండి.
 6. దానిపై ఇంకో పూరి తో మూయండి.చివరి అంచులు అవసరమైతే తడి చేత్తో మూయండి.
 7. అంచులు చేత్తో వొత్తి, కర్ర తో కూర బయటకు రాకుండా పలుచగా చపాతీ లాగా వొత్తండి.
 8. ఆర కుండా, పొయ్యి పై పెనం పెట్టి, పెనం బాగా కాలాక చపాతీ లు కాల్చండి.నెయ్యి రాసి కూర తోకాని, పెరుగు తో కానీ వొడ్డించండి.

నా చిట్కా:

కూర లో పచ్చి మిర్చి, పోపు గింజలు వేయవొద్దు. బేలించే టప్పుడు బయటకు వొస్తాయి. మిగిలిన ఏ కూర తో నైనా ప్రయత్నించండి.

Reviews for STUFFED CABBAGE ROTI Recipe in Telugu (0)