హోమ్ / వంటకాలు / క్యాబేజీ పరాట

Photo of STUFFED CABBAGE ROTI by Sandhya Rani Vutukuri at BetterButter
948
4
0.0(0)
0

క్యాబేజీ పరాట

Sep-05-2018
Sandhya Rani Vutukuri
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ పరాట రెసిపీ గురించి

చాలా మంది పెద్దలు, పిల్లలు కొన్ని కూరలు తినరు. అమ్మలు తెలివిగా ఆ కూరలు ఎలాగైనా పొట్ట లోకి పంపాలంటే పరాటాలు బెస్ట్. ఆలూ పరాటాలు, మూలి పరాటాలు అందరికి తెలుసు. నేను మీకు క్యాబేజీ పరాట చెప్తాను. డబ్బాల్లోకి చల్లారి పోయాక కూడా మృదువుగా వుండి, తిన బుద్ధి అయ్యే లాగా వుండి, లోపల యేమి కూర పెట్టామో అస్సలు తెలియదు. తప్పకుండా చేయండి. మీకు తప్పకుండా చేసి నాకు చెప్పండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1/4 కేజీ
  2. క్యాబేజీ 1/4 కేజీ (సుమారు)
  3. ఉప్పు 1 చెంచా
  4. ఎర్ర కారం 1 చెంచా
  5. గరం మసాలా పొడి చిటికెడు
  6. నూనె 1 చెంచా
  7. నీళ్లు 1 గ్లాసు
  8. నెయ్యి 2 చెంచాలు
  9. అల్లంవెల్లుల్లి కొంచెం

సూచనలు

  1. క్యాబేజీ ని తురుము పీట పై కానీ, ఇలాంటి పీట లో కానీ చాలా సన్నగా తరగండి.
  2. పొయ్యి పై మూకుడు పెట్టి, చెంచా నూనె వేసి అల్లం వెల్లుల్లి గరం మసాలా,ఉప్పు కారంతో క్యాబేజి కూర చేసి చల్లార నివ్వండి.
  3. గోధుమపిండి ని తీసుకొని ఉప్పు లేకుండా చపతిలకు పిండి ని తడుపు కొని 20 ని.లు నాన నివ్వండి.
  4. పిండి ని పూరి కి కావాల్సిన సైజు లో ఉండలు చేసి,12 పూరీలు వొత్తుకోవాలి. (6 పరాటాలు కోసం)
  5. ఒక పూరి ని తీసుకొని, 1 చెంచా కూర పెట్టండి.
  6. దానిపై ఇంకో పూరి తో మూయండి.చివరి అంచులు అవసరమైతే తడి చేత్తో మూయండి.
  7. అంచులు చేత్తో వొత్తి, కర్ర తో కూర బయటకు రాకుండా పలుచగా చపాతీ లాగా వొత్తండి.
  8. ఆర కుండా, పొయ్యి పై పెనం పెట్టి, పెనం బాగా కాలాక చపాతీ లు కాల్చండి.నెయ్యి రాసి కూర తోకాని, పెరుగు తో కానీ వొడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర