ఆవ పెట్టిన దద్దోజనం | Ava daddojanam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ava daddojanam by Sree Vaishnavi at BetterButter
ఆవ పెట్టిన దద్దోజనంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

4

0

ఆవ పెట్టిన దద్దోజనం వంటకం

ఆవ పెట్టిన దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ava daddojanam Recipe in Telugu )

  • మెత్తగా ఉడికిన అన్నం 1 కప్
  • జీడిపప్పు 5-6
  • ఆవ ముద్ద 1 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 2
  • పచ్చిమిరపకాయలు 1-2
  • అల్లం సన్నగా తరిగినది 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • మిరియాలు 2-3 గింజలు
  • మినపప్పు 1 చెంచా
  • పెరుగు 1 కప్పు
  • ఆవాలు 1 చెంచా
  • నూనె 2 చెంచాలు
  • పాలు 1 కప్పు
  • ఉప్పు తగినంత
  • పల్లీలు 2 చెంచాలు

ఆవ పెట్టిన దద్దోజనం | How to make Ava daddojanam Recipe in Telugu

  1. ముందుగా ఉడికిన అన్నం బాగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,పాలు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి ,ఆవ ముద్దా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. దానిని కొంచెం జారుగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  6. అందులో ఆవాలు, మినపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, పల్లీలు ,పచ్చిమిర్చి ,జీడిపప్పు ,కరివేపాకు ,వేసి బాగా వేయించి అల్లం కూడా వేసుకుని వేయించుకోవాలి
  7. దానిని పెరుగు మిశ్రమం లో వేసుకుని కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Ava daddojanam Recipe in Telugu (0)