హోమ్ / వంటకాలు / షెజవ్వాన్ సాస్ తో ఆలూ పరాటా రోల్స్...

Photo of Alu paratha rols with shezwaansas and mayonyiz sas by Shobha.. Vrudhulla at BetterButter
288
5
0(0)
0

షెజవ్వాన్ సాస్ తో ఆలూ పరాటా రోల్స్...

Sep-05-2018
Shobha.. Vrudhulla
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షెజవ్వాన్ సాస్ తో ఆలూ పరాటా రోల్స్... రెసిపీ గురించి

పిల్లలకి ఆలూ పరాట చాలా ఇష్టంగా తింటారు.దానికే కాస్త మార్చి పిల్లలకి యింకా ఎక్కువగా నచ్చేట్టుగా షెజవ్వాన్ సాస్ మరియు మయోనైజ్ సాస్ తో చేశా..

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • టిఫిన్ వంటకములు
 • పంజాబీ
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. బంగాళాదుంపలు 6
 2. గోధుమ పిండి తగినంత లేదా నాలుగు పరాటాలు కి సరిపోయినట్టు తీసుకోవాలి
 3. ఉప్పు తగినంత
 4. పసుపు చితికేడు
 5. అల్లం ముద్ద ఒక చెంచా
 6. ధనియాల గుండా ఒక చెంచా
 7. జీలకర్ర గుండా అరా చెంచా
 8. పచ్చిమిరపకారాల ముద్ద ఒక చెంచా లేదా మనకు తగ్గట్టు కారము ఎక్కువ తక్కువ చేసి వేయొచ్చు
 9. కొత్తిమీర బాగా గుండగా తరిగినది కొంచెం
 10. చిటికెడు ఇంగువ
 11. పంచదార ఒక చెంచా
 12. పెరుగు తియ్యనిది ఒక చెంచా కావాలంటే పుల్లటి పెరుగు కూడా వేయొచ్చు నచినవాళ్ళు
 13. నూనె అరా కప్పు
 14. షెజవ్వాన్ సాస్ ఒక అరా కప్పు
 15. మయోనియజ్ సాస్ నాలుగు చెంచాలు
 16. నెయ్య లేక బటర్ పరాటాలు చేయటానికి

సూచనలు

 1. ముందుగా దుంపలకి ఉడికించి చల్లారటనికి తీసి పెట్టుకోవాలి
 2. ఇప్పుడు గోధుమ పిండిలో ఉప్పు కొంచెం పసుపు.. పంచదార ...దనియా గుండా కొంచెం ...జీలకర్ర గుండా చాలా కొంచెం వేయాలి....యింకా కాస్త రెండు చెంచాల పెరుగు వేయాలి..
 3. ఇవన్నీ పిండిలో వేసి బాగా ఒకసాని కలిపి అప్పుడు అందులో మూడూ చెంచాల నూనె వేసి మళ్ళీ బాగా కలిపి అప్పుడు దానిలో చూసుకొని నీళ్లు పోస్టు రొట్టెల పిండి కి తగ్గట్టు చక్కగా గట్టిగా కలుపుకోవాలి ..
 4. కలిపిన తరువాత మూతపెట్టి ఒక ఐదు నిమిషాలవరకు ఉండనివ్వాలి..అప్పుడే ముద్ద చక్కగా మెత్తగా ఉంటుంది.
 5. ఇప్పుడు చల్లారిన దుంపలకి తొక్కతీసి బాగా ముద్దగా చేసి పేట్టుకోవలెను.
 6. యి దుంపలు ముద్దలో ఉప్పు పసుపు...అల్లం ముద్ద....పచ్చిమిర్చి ముద్ద...దనియా గుండా..జీలకర్ర గుండా...కొత్తిమీర... వేసి బాగా కలిపి ఉంచుకోవలెను
 7. ఇప్పుడు కలిపి ఉంచిన రొట్టెల మొడ్డని చక్కగా ఉండలు చేసి చిన్న సీజీలో వత్తాలి.వ్.
 8. వత్తెక దానికి కాస్త నెయ్యగాని బట్టర్ గాని చక్కగా రాసి అందులో తయారుగా ఉంచిన దుంపలు ముద్దని ఒక ఉండల చేసి యి వత్తి న రొట్టెలో పెట్టి బాగా పూర్తిగా రొట్టె ని కప్పేయాలి..
 9. అలాగే అన్ని రొట్టెలు దుంపలు ముద్దపెట్టి కవర్ చేసి ఉంచుకోవలెను
 10. ఇప్పుడు ఒక్కక్క ఉందా తీసి పొడి పిండి వేస్తూ మెల్లిగా జాగ్రత్తగా వత్తాలి..అలానే అన్ని పరాటాలు ల వత్తుకొని ఉంచుకోవలెను
 11. ఇప్పుడు పెనం వేడి చేసాక ముందుగా పెనానికి కాస్త నూనె రాయాలి వేయగానే రొట్టి అంట కుండ ఉండటానికి
 12. పోరాట వేసి పెనం మీద చక్కగా బాగ కాలేక తిరగ వేయాలి .
 13. ఇప్పుడు రెనడవ వయిపు కూడా కాలుతుండగా మీద నూనె రాసి యింకా పరట చుట్టూ కూడా నూనె వేసి బాగా తిప్పుతూ కాల్చాలి..
 14. పెనం మీద పరతా ఉండగానే స్టవ్ తగ్గించి ఇప్పుడు పరట మీద షెజవ్వాన్ సాస్ బాగా చుట్టూ రాయాలి...
 15. రసాక ఒక్క అరా నిమిషం ఉంచస్లీ అటు ఇటు కదుపుతూ ..లేకపోతే మాడిపోతుంది..
 16. ఇప్పుడు అది తీసి ఒక ప్లేటులో పెట్టుకొని దానికి మధ్యలో మయోనైజ్ సాస్ ఒక అరా చంచ వేసి కాస్త అటు ఇటు రాయాలి..మొత్తం రొట్టి అంత రాయకూడదు
 17. రాసాక ఇప్పుడు పరట కి మెల్లిగా రోల్ చేసి మూడు ముక్కలుగా కట్ చేసుకొని టూత్పిక్ తో గుచ్చి పక్కన పెట్టుకోవలెను
 18. యిదే మాదిరి మిగిలినవి కూడా చేసి ఒక ప్లేటులో కానీ లంచ్ బాక్సలో కానీ పెట్టి పక్కన వాటితో టమాట సాస్ మరియు వెల్లుల్లి మయోనైజ్ సాస్ లో ముంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది..
 19. యి దుంపల పరాటాలు లో నెయ్య వేసి వట్టటం వల్ల బలమయినది రుచికరమైంది...యింకా షెజవ్వాన్ సాస్ మరియు మయోనైజ్ సాస్ వల్ల పరాటాలు కి మంచి రుచి వచ్చి పిల్లలు చాలా ఇష్టముగా కూడా తింటారు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర