గోంగూర పులుసు | GONGURA pulusu Recipe in Telugu

ద్వారా Sailaja Chavali  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GONGURA pulusu recipe in Telugu,గోంగూర పులుసు, Sailaja Chavali
గోంగూర పులుసుby Sailaja Chavali
  • తయారీకి సమయం

    45

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

గోంగూర పులుసు వంటకం

గోంగూర పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GONGURA pulusu Recipe in Telugu )

  • పుల్ల గోంగూర లేదా గోంగూర 1 కట్ట
  • నువ్వులు పప్పు 1/4 కప్
  • ఆయిల్ 5 స్పూన్స్
  • వెల్లుల్లి 5 రెబ్బలు
  • ఆవాలు 2 స్పూన్
  • మెంతులు 1 స్పూన్
  • ఇంగువ 1 స్పూన్
  • ఎండు మిరపకాయలు 10
  • ఉప్పు తగినంత
  • పసుపు 1స్పూన్

గోంగూర పులుసు | How to make GONGURA pulusu Recipe in Telugu

  1. ముందుగా గోంగూర కట్ట నుండి ఆకులను విడదీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి
  2. ఒక బాణాలి తీసుకుని దానిలో నువ్వుల పప్పు ని నూనె లేకుండా వేయించాలి. దానిని ఒక ప్లేట్ లో కి తీసుకుని చల్లారాక గ్రైండ్ చెయ్యాలి
  3. ఇప్పుడు అదే బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయిన తర్వాత చెరో స్పూన్ ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి పోపు వేయించుకుని వేయించుకున్న నువ్వుల పప్పు తొ కలిపి నీరు పోసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి
  4. ఇప్పుడు ఒక బాణాలి లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మిగిలిన ఆవాలు, మెంతులు, 2 ఎండు మిరపకాయలు, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకుని దానిలో కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ను చిన్న ముక్కలుగా చేసుకుని తాలింపు లో వేసి మగ్గనివ్వాలి.కొంచెం పసుపు కూడావేసి మగ్గనివ్వాలి
  5. మగ్గనిచే అప్పుడు మూత పెట్టకూడదు
  6. గోంగూర బాగా మగ్గి వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం నీరు పోసికుని గోంగూర లో వెయ్యాలి
  7. ఉప్పు తగినంత వేసుకుని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి

నా చిట్కా:

గోంగూర పుల్ల గా లేకపోతే కొంచెం చింత పండు వేసుకోవచ్చు. గోంగూర పులుసు ఒకటి లేదా రెండు రోజులు వరకు నిల్వ ఉంటుంది ..

Reviews for GONGURA pulusu Recipe in Telugu (0)