మెంతికూర ప్రైడ్ రైస్ | MENTIKURA rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MENTIKURA rice recipe in Telugu,మెంతికూర ప్రైడ్ రైస్, Kavitha Perumareddy
మెంతికూర ప్రైడ్ రైస్by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

మెంతికూర ప్రైడ్ రైస్ వంటకం

మెంతికూర ప్రైడ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MENTIKURA rice Recipe in Telugu )

  • అన్నం ఒక పెద్ద కప్ అన్నం పొడిపొడిగా ఉండాలి.
  • మెంతికూర ఒక చిన్న కప్
  • పచ్చిమిర్చి 3
  • ఉల్లిపాయ 1పెద్దది
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పున్
  • పోపుగింజెలు స్పున్
  • నూనె లేకపోతే నెయ్యి 2 స్పూన్స్
  • జీడిపప్పు 10 గ్రామ్
  • ఉప్పు తగినంత
  • కరేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా

మెంతికూర ప్రైడ్ రైస్ | How to make MENTIKURA rice Recipe in Telugu

  1. ముందుగా మెంతికూర శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నెయ్యి వేసి వేడిచేసి పోపుగింజెలు,జీడిపప్పు వేసి వేగనివ్వాలి .తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,ముక్కలు,తగినంత ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి,అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి .
  4. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మెంతికూర వేసి పచ్చివాసన పోయేవరకు వేపాలి.కొత్తిమీర, కరేపాకు వేసి కలిపాలి.
  5. ఇప్పుడు ఈ మెంతికూర మిశ్రమంలో అన్నం వేసి అంతా బాగా కలిపి 5 నిముషాలు ఉంచాలి.
  6. ఇంకా వేడి వేడిగా మెంతికూర ప్రైడ్ రైస్ రెడీ .

నా చిట్కా:

మెంతికూర పచ్చివాసన పోయే వరకు మగ్గితేనే అన్నం రుచిగా ఉంటుంది.

Reviews for MENTIKURA rice Recipe in Telugu (0)