ఆలూ పరాట | STUFFED ROTI Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of STUFFED ROTI by Sandhya Rani Vutukuri at BetterButter
ఆలూ పరాటby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

ఆలూ పరాట వంటకం

ఆలూ పరాట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make STUFFED ROTI Recipe in Telugu )

  • గోధుమపిండి 1/4 కేజీ
  • అలుగడ్డలు 1/4 కేజీ
  • ఉప్పు 2 చెంచాలు
  • కారం 1 చెంచా
  • పసుపు చిటికెడు
  • ఇంగువ చిటికెడు
  • ధనియాల పొడి 1/2 చెంచా
  • గరం మసాలా పొడి 1/2 చెంచా
  • అల్లంవెల్లుల్లి చిటికెడు
  • నిమ్మ రసం 1 చెక్క
  • నెయ్యి 6 చెంచాలు

ఆలూ పరాట | How to make STUFFED ROTI Recipe in Telugu

  1. అలుగడ్డలు కుక్కర్ లో ఉడికించండి.
  2. గోధుమపిండి మెత్తగా చపాతీ ల కోసం కలపి అర గంట నాన నివ్వండి.
  3. ఉడికిన ఆలూ ను తురుము పీట తో తురిమి, దానిలో అన్ని మసాలాలు(అల్లంవెల్లుల్లి,పసుపు,ధనియా,ఇంగువ,గరం మసాల) ఉప్పు కారం వేసి కూర చేయండి.
  4. దానిలో కొంచెం నిమ్మరసం పిండండి.
  5. ఇప్పుడు చపాతీ పిండి ని పూరీలు గా వొ త్తు కొండి.
  6. చల్లారిన ఆలూ మిశ్రమాన్ని ఒక పూరి పై వేసి, దానిపై ఇంకో పూరి ని పరచండి.
  7. అంచులు చేత్తో పైపైన వొత్తి, రోటి కర్ర తో చపాతీ లాగా చేయండి.
  8. దాన్ని పెద్ద మంట తో పెనం పై కాల్చండి.
  9. చక్కగా పొంగిన పోరాటాలను నెయ్యి రాసి కొంచెం చల్లారాక డబ్బాలో పెట్టండి.
  10. ఒక కప్పు పెరుగు లో చిటికెడు చాట్ మసాల, 2 చెంచాల బూందీ వేసి వేరే డబ్బాలో పరాట ముంచుకోవడానికి ఇవ్వండి.

నా చిట్కా:

ఆలూ మిశ్రమం లో ఒక స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే పరిచేటప్పుడు చేతికి లాఠీ కి అంటుకోకుండా శుభ్రంగా వస్తాయి.

Reviews for STUFFED ROTI Recipe in Telugu (0)