హోమ్ / వంటకాలు / ఆలూ పరాట

Photo of STUFFED ROTI by Sandhya Rani Vutukuri at BetterButter
1222
9
0.0(0)
0

ఆలూ పరాట

Sep-06-2018
Sandhya Rani Vutukuri
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పరాట రెసిపీ గురించి

పరాట అనగానే గుర్తుకు వొచ్చేది, ప్రతి ఒక్కరూ ఇష్ట పడేది ఆలూ పరాట. దీనిలో వేసే పదార్థాలు ప్రతి వంట ఇంట్లో వుంటాయి. లంచ్ బాక్స్ లోకి చక్కటి భోజనం అని చెప్పవొచ్చు. పిండిపదార్ధాలు, కూర రెండూ అందుతున్నాయి. అందరూ చేసేదే,అయినా నేను గోధుమపిండి ముద్దను గిన్నె లాగా చేసి కూర పెట్టటం తో కూర బయటకు రావడమో, అంచుల్లో కూర లేకుండా వుండటమో అవుతుంటుంది. నేను కొంచెం మార్చి చేస్తాను. మీరూ ప్రయత్నిస్తారు కదూ!

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 1/4 కేజీ
  2. అలుగడ్డలు 1/4 కేజీ
  3. ఉప్పు 2 చెంచాలు
  4. కారం 1 చెంచా
  5. పసుపు చిటికెడు
  6. ఇంగువ చిటికెడు
  7. ధనియాల పొడి 1/2 చెంచా
  8. గరం మసాలా పొడి 1/2 చెంచా
  9. అల్లంవెల్లుల్లి చిటికెడు
  10. నిమ్మ రసం 1 చెక్క
  11. నెయ్యి 6 చెంచాలు

సూచనలు

  1. అలుగడ్డలు కుక్కర్ లో ఉడికించండి.
  2. గోధుమపిండి మెత్తగా చపాతీ ల కోసం కలపి అర గంట నాన నివ్వండి.
  3. ఉడికిన ఆలూ ను తురుము పీట తో తురిమి, దానిలో అన్ని మసాలాలు(అల్లంవెల్లుల్లి,పసుపు,ధనియా,ఇంగువ,గరం మసాల) ఉప్పు కారం వేసి కూర చేయండి.
  4. దానిలో కొంచెం నిమ్మరసం పిండండి.
  5. ఇప్పుడు చపాతీ పిండి ని పూరీలు గా వొ త్తు కొండి.
  6. చల్లారిన ఆలూ మిశ్రమాన్ని ఒక పూరి పై వేసి, దానిపై ఇంకో పూరి ని పరచండి.
  7. అంచులు చేత్తో పైపైన వొత్తి, రోటి కర్ర తో చపాతీ లాగా చేయండి.
  8. దాన్ని పెద్ద మంట తో పెనం పై కాల్చండి.
  9. చక్కగా పొంగిన పోరాటాలను నెయ్యి రాసి కొంచెం చల్లారాక డబ్బాలో పెట్టండి.
  10. ఒక కప్పు పెరుగు లో చిటికెడు చాట్ మసాల, 2 చెంచాల బూందీ వేసి వేరే డబ్బాలో పరాట ముంచుకోవడానికి ఇవ్వండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర