మామిడికాయ పులిహోర | GREEN MANGO RICE Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • GREEN MANGO RICE recipe in Telugu,మామిడికాయ పులిహోర, Sandhya Rani Vutukuri
మామిడికాయ పులిహోరby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

మామిడికాయ పులిహోర వంటకం

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GREEN MANGO RICE Recipe in Telugu )

  • బియ్యం 1/4 కేజీ
  • సగం మామిడి కాయ తురుము5 చెంచాలు
  • పోపు కోసం 3 చెంచాల పల్లి లు
  • పచ్చి సెనగ పప్పు 1/2 చెంచా
  • మినప్పప్పు 1/2 చెంచా
  • ఆవాలు, జీలకర్ర 1 చెంచా
  • పసుపు చిటికెడు
  • ఇంగువ చిటికెడు
  • మెంతి పిండి చిటికెడు
  • పచ్చి మిర్చి 2
  • ఎండుమిర్చి 2
  • కరివేపాకు 6 ఆకులు
  • నూనె 4,5 చెంచాలు
  • ఉప్పు 1 చెంచా

మామిడికాయ పులిహోర | How to make GREEN MANGO RICE Recipe in Telugu

  1. 1/4 కిలో బియ్యం కడిగి అన్నం పొడిగా వొండి వుంచండి
  2. ఒక్క మామిడికాయ తురుము లో సగం మాత్రం తీసుకోండి.
  3. పొయ్యి పై బాండీ పెట్టి, నూనె వేసి కాగిన తరువాత, వరుసగా పల్లీలు, పచ్చి సెనగ పప్పు, మినపప్పు, మిరపకాయలు,ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతి పిండి,కరివేపాకు వేయండి.
  4. పసుపు, మామిడికాయ తురుము ను పోపులో వేసి 2 ని.లు మాత్రమే వేయించండి.
  5. ఈ దశ లో ఉడికిన అన్నం, ఉప్పు వేసుకొని పోపు ను బాగా అంటేలాగా కలిపి చల్లారాక డబ్బాలో పెట్టండి.

నా చిట్కా:

మామిడికాయతురుము ను పోపులో వేసి చల్లారాక ఫ్రిడ్జి లో 15 రోజులు నిలవ ఉంచుకొని, అన్నం మిగిలినప్పుడల్లా పులిహోర చేసుకోవచ్చు

Reviews for GREEN MANGO RICE Recipe in Telugu (0)