అటుకుల పులిహోర | Poha pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Poha pulihora recipe in Telugu,అటుకుల పులిహోర, Sree Vaishnavi
అటుకుల పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    72

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

2

0

అటుకుల పులిహోర వంటకం

అటుకుల పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poha pulihora Recipe in Telugu )

  • అటుకులు పావుకిలో 
  • మినప పప్పు 2 చెంచాలు
  • సెనగపప్పు 2 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • పచ్చిమిరపకాయలు నాలుగు 
  • కరివేపాకు రెండు రెమ్మలు 
  • ఇంగువ చిటికెడు
  • నిమ్మకాయలు రెండు 
  • వేరు శనగపప్పులు 2 చెంచాలు
  • నూనె 4 చెంచాలు
  • పసుపు చిటికెడు
  • ఎండుమిరపకాయలు 2
  • అల్లం 1 చెంచా
  • నీళ్లు తగినంత

అటుకుల పులిహోర | How to make Poha pulihora Recipe in Telugu

  1. అటుకులను శుభ్రం చేసి నీళ్లతో కడిగి అందులో ఉన్న నీళ్లను పూర్తిగా వంపేయాలి.
  2. ఆ తర్వాత మూతపెట్టి గంటసేపు అలాగే ఉంచాలి. 
  3. ఆ తరువాత దాంట్లో ఉప్పు, పసుపు నిమ్మరసం, వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు బాండీ లో నూనె వేసి కాగాక అందులో ముందుగా పల్లీలు వేసి వేయించాలి
  5. పల్లీలు వేగాక అందులో మినపప్పు, సెనగపప్పు ,ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ ఒక దాని తరువాత ఒక వేసి వేయించుకోవాలి
  6. వేగిన తరువాత అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేయించాలి
  7. వేగిన తరువాత దానిని అటుకుల మిశ్రమం లో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Poha pulihora Recipe in Telugu (0)