మెగీ తో భేల్ | Bhel with Meggi Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bhel with Meggi recipe in Telugu,మెగీ తో భేల్, Shobha.. Vrudhulla
మెగీ తో భేల్by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

మెగీ తో భేల్ వంటకం

మెగీ తో భేల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bhel with Meggi Recipe in Telugu )

 • మేగీ రెండు పేకెట్స్ (20 Rs పెక్ ఒకటి)
 • మేగీ మాసాల రెండు ప్యాక్స్
 • టమాట సాస్ అర కప్పు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మన రుచిని బట్టి
 • ఉల్లిపాయలు ఒక కప్పు
 • టమాటాలు ఒక కప్పు
 • దుంపలు మాములు సైజ్వి నాలుగు ఉడికించి తొక్క తీసి ఉంచుకోవలెను
 • సనగపలుకులు అరకప్పు నూనెలో వేయించి ఉంచుకోవలెను
 • జీడిపప్పు ఒక పది పలుకులు
 • మిరపకాయ ఒకటి బాగా చెక్కుతరిగి ఉంచుకోవలెను
 • చిల్లీ ఫ్లేక్స్ ఒక చెంచా
 • కొత్తిమీర ఒక కప్పు
 • చిన్న సేవ్ ఒక కప్పు
 • నిమ్మకాయలు రెండు
 • నూనె రెండు చంచాలు
 • ఉప్పు తగినంత..

మెగీ తో భేల్ | How to make Bhel with Meggi Recipe in Telugu

 1. ముందుగా దుంపలు ఉడికించి చాలరక తొక్కతిసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవలెను.
 2. ఇప్పుడు మేగీ కి ఒక ముచ్చి కవర్లో వేసి బాగా ముక్కలు చేసి పెట్టుకోవలెను..
 3. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి దానిలో మేగీ పొడిగానే వేయించి పెట్టుకోవాలి నూనె వేయరాదు.. బాగా పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవలెను
 4. ఇప్పుడు మరో ముకుడులో రెండు చెంచాల నూనె వేసి అది వేడెక్కేక అందులో ముందు జీఫిపప్పు వేయించి తీసుకో వలెను
 5. ఆ తరువాత సనగపలుకులు వేసి వేయించి తీసి పెట్టుకోవలెను..
 6. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ముందుగా మేగీ మసాలా గుండా వేయవలెను
 7. అందులోనే టమాట సాస్ కూడా వేసి రెండు అంటే మెగీ మసాలా గుండా మరియు టమాట సాస్ బాగా కలిసేలా కలపవలెను
 8. ఇప్పుడు ఆ కలిపిన మాసాలలో ఉల్లిపాయలు... టమాటాలు...తరిగిన దుంపలు....సనగపలుకులు...సగం జీడిపప్పు....మిరపకాయముక్కలు మరియు చిల్లీ ఫ్లెక్స్ వేసి అన్నీ బాగా కలిసే ల కింద మీద కలప వలెను
 9. ఇదంతా కలిసేక బాగా అందులో మిగిలినవి కొత్తిమీర.... ఉప్పు సగం చిన్న సేవ్ సన్నపాటిది వేసి మళ్ళీ మరోసారి బాగా కలిపి ప్లేటులో సర్వ్ చేసుకొనటమే
 10. ఇప్పుడు ప్లేటులో సర్వ్ చేసాక అందులో మీదనుంచి కొంచెం సేవ్..కొంచెం కొత్తిమీర..మిగిలిన జీడిపప్పు వేసి దాని చుట్టూ కలిసేలా నిమ్మకాయ రసం పిండుకోవలెను..
 11. నిమ్మరసం మనకి తగినట్టు వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ చేసి.అంతే..
 12. ఎంతో రుచికరమయిన మేగీ భేల్ తయారు...

నా చిట్కా:

చిల్లీ ఫ్లెక్స్...జీడిపప్పు పిల్లల రుచి కోసము నేను వేసాను.మీకు కావాలంటే వేయొచ్చు లేకపోయినా పర్వాలేదు...అది మీ ఇష్టం..

Reviews for Bhel with Meggi Recipe in Telugu (0)