హోమ్ / వంటకాలు / పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్.

Photo of Peri peri mayonise stuffing roles. by Swapna Tirumamidi at BetterButter
574
4
0.0(0)
0

పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్.

Sep-06-2018
Swapna Tirumamidi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్. రెసిపీ గురించి

పెరి పెరి సాస్ తో తయారు చేస్తాము కాబట్టి ఇలా పేరు పెట్టాను...ఈ సాస్ పోర్చుగీస్,సౌత్ ఆఫ్రికాలలో ఎక్కువగా చాలా వంటల్లో వాడతారు... ఘాటైన "పెరి పెరి" మిరపకాయలతో తయారుచేస్తారు...ఇది రుచితో పాటు ఘాటైన కారాన్ని ఇస్తుంది వంటకి.అందువల్ల కారాలు పడనివారు కాస్త జాగర్తగా చూసి వాడుకోవాలి.పదార్ధాలు ఎక్కువున్నాయని కంగారు పడకుండా ప్రయత్నించి చూడండి.తప్పక నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. సాస్ కోసం ..కాశ్మీరీ ఎండుమిరపకాయలు 10
  2. ఒరిగానో 1 చెంచా
  3. కారం 1 చెంచా
  4. నిమ్మరసం 1 చెంచా
  5. వెనిగర్ 1 చెంచా
  6. ఆలివ్ ఆయిల్ 2 చెంచాలు
  7. ఉప్పు రుచికి చాలినంత
  8. మయోనిస్ 2 పెద్ద చెంచాలు.
  9. కూరకొఱకు...కాలిఫ్లవర్ ముక్కలు అరకప్పు
  10. కాప్సికమ్స్ 3 రంగుల ముక్కలు 1 కప్
  11. స్వీట్ కార్న్ అరకప్పు
  12. పన్నీర్ 1 కప్
  13. టమాటా తరుగు అరకప్పు
  14. చిలగడ దుంప కోరు అరకప్పు(పంచదార కి బదులుగా నేను దీన్ని వాడాను)
  15. మిరాయపొడి చిటికెడు
  16. ఉప్పు చిటికెడు
  17. ఒరిగానో 2 చిటికెళ్లు
  18. గోధుమపిండి 2 కప్పులు
  19. బటర్ లేదా నూనె 1 పెద్ద చెంచాడు.

సూచనలు

  1. ముందుగా సాస్ కోసం...మిరపకాయలు 15 నిమిషాలు వేడినీళ్లలో నానపెట్టి ఉంచాలి.
  2. మిక్సిజార్లో నానిన మిర్చి,ఒరిగానో,నిమ్మరసం,కారం,వెనిగర్,ఆలివ్ ఆయిల్,ఉప్పు చిటికెడు వేసి మెత్తగా పేస్ట్ లా చేసి ఒకబౌల్ లోకి తీసిపెట్టికోవాలి.ఈ పేస్ట్ ని ముందుగా తయారు చేసి నిలువ ఉంచుకుంటే పని సులువుగా ఉంటుంది.
  3. ఒక బౌల్లోకి 2 పెద్దచెంచాల మయోనిస్(గుడ్డు లేని)వేసి,ఒక చెంచా మిర్చి పేస్ట్ వేసి రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి..
  4. గోధుమపిండి కొద్దిగా నూనె ఉప్పువేసి తగినన్ని నీళ్లు పోసి ముద్ద చేయాలి ...ఈ చపాతీ ముద్దని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు...ఒక మూకుడు పొయ్యిమీద పెట్టి మీడియం మంట లో ఉంచి ,కొద్దిగా నూనె లేదా బటర్ వేసి వేడిచెయ్యాలి.
  6. ఇప్పడు అందులో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా తరిగి ఉంచుకున్న కాలిఫ్లవర్, క్యాప్సికమ్స్, టమాటా,స్వీట్ కార్న్,చిలగడ దుంప కోరు,పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా మగ్గేలా వేయించాలి.
  7. ఇప్పుడు చిటికెడు ఉప్పు,మిరియాలపొడి,చిటికెడు ఒరిగానో వేసి ఒకసారి కలిపి పొయికట్టేయాలి.
  8. ఈ వేయించిన కూరని ముందుగా రెడి చేసుకున్న పెరి పెరి సాస్,మయోనిస్ బౌల్ లో వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  9. ఇక పెనం పొయ్యిమీద పెట్టి ,చపాతీపిండిని ముద్దలుగా చేసి పలుచగా చపాతీలా చేసి పెనంపై సన్న సెగమీద మెత్తగా కాల్చుకోవాలి...
  10. ఇప్పుడు కాల్చిన చపాతీని ప్లేట్ లోకి తీసుకొని కాస్త నెయ్యి రాసి, తయారు చేరుకున్న మిశ్రమాన్ని చపాతి మీద పెట్టి రోల్ చేసుకుని ,చివరలను కూడా లోపలికి మడత పెట్టకుంటే లోపలి కూర బయటికి రాకుండా ఉంటుంది...కావాలంటే మధ్యకి కట్ చేసుకోవచ్చు.
  11. అంతే కొత్తగా ,మంచి కారం గా,సరికొత్త రుచితో పెరి పెరి మయినిస్ రోల్స్ తినడానికి సిద్ధం..ఇవి 2 రోల్స్ టిఫిన్ బాక్స్ లో పెట్టి ,కొంచెం సలాడ్,కొన్ని పండ్ల ముక్కలతో,పొగిచిన శెనగల తో సద్ది ఇస్తే ఆ రోజుకు అది సంపూర్ణమైన ఆహారం అందించినట్లే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర