గోబీ టమాట కూర తో 3 మిక్స్ చపాతీ | Tri mix roti with cauliflower tomato curry. Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  7th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tri mix roti with cauliflower tomato curry. recipe in Telugu,గోబీ టమాట కూర తో 3 మిక్స్ చపాతీ, Swapna Tirumamidi
గోబీ టమాట కూర తో 3 మిక్స్ చపాతీby Swapna Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

గోబీ టమాట కూర తో 3 మిక్స్ చపాతీ వంటకం

గోబీ టమాట కూర తో 3 మిక్స్ చపాతీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tri mix roti with cauliflower tomato curry. Recipe in Telugu )

 • కూర కి....చిన్నగా తరిగిన గోబీ 2 కప్
 • ఉల్లిముక్కలు 1 కప్
 • టమాటా ముక్కలు 1 కప్
 • ఆవాలు పావు చెంచా
 • జీలకర్ర పావు చెంచా
 • ధనియాలు 1 చెంచా
 • డ్రై/ పచ్చి కొబ్బరి పొడి/కోరు 1 చెంచా
 • వెల్లుల్లి రెబ్బలు 2
 • కారం అర చెంచా
 • పచ్చిమిర్చి 2
 • కరివేపాకు కొద్దిగా
 • కొత్తిమీర
 • ఉప్పు సరిపడా.
 • గరం మసాలా పొడి అర చెంచా.
 • చపాతి కొరకు....గోధుమ పిండి 2కప్
 • జొన్న పిండి(జవార్) 1 కప్
 • మొక్కజొన్నల పిండి(మక్కా) 1 కప్
 • వెన్న 2 పెద్దచెంచాలు
 • ఉప్పు కొద్దిగా
 • జీలకర్ర కచపచ్చగా దంచిన పొడి అర చెంచా
 • నూనె కూరకు,చపాతీ లకు చాలినంత.

గోబీ టమాట కూర తో 3 మిక్స్ చపాతీ | How to make Tri mix roti with cauliflower tomato curry. Recipe in Telugu

 1. ముందుగా 3 రకాల పిండిలను ఒక బేసను లోకి తీసుకుని బాగా కలిపి, ఉప్పు ,వెన్న,దంచిన జీలకర్ర పొడి కూడా వేసి మంచినీళ్లు పోస్తూ చపాతీలకి సరిపడే అంత గట్టిగా కలుపి పైన నూనె రాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.మరి గట్టిగా ఉండకూడదు.
 2. ఇప్పుడు మిక్సీజార్ లో ధనియాలు,జీలకర్ర,కొద్దిగా కారం,కొబ్బరి,వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి కొట్టుకోవాలి.
 3. మూకుడు పెట్టి కొద్దిగా 3 చెంచాల ఆయిల్ వేసి,కాగాక ఆవాలు వేసి అవి చితపటలాడాక,జీలకర్ర, తయారుచేసుకున్న పొడి,గరం మసాలా పొడి,పచ్చిమిర్చి ముక్కలు ,కరివేపాకు వేసి వేయించాలి.
 4. పోపు బాగా వేగాక ,ఉల్లిపాఠముక్కలు వేసి వేయించి కాస్తవేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.(ఉప్పు చల్లి మూత పెడితే తొందరగా మగ్గుతాయి.)
 5. టమాటా బాగా మగ్గి మెత్తగా అయ్యాక గోబీ ముక్కలు వేసి ఒకసారి కలిపి ఉప్పు వేసి మూత పెట్టాలి.గోబీలో ఉన్ననీటి శాతం తో కూర బాగా మగ్గుతుంది కాబట్టి విడిగా నీరు పోస్తే బాక్స్ లో సద్దేటప్పుడు ఇబ్బంది గా ఉంటుంది.
 6. గోబీ త్వరగా మగ్గిపోతుంది...ఇప్పుడు ఉప్పుసరి చూసుకుని చివరిగా కొత్తిమీర చల్లి దించుకోవాలి.ఇక్కడి తో కూర రెడీ .
 7. ఇప్పుడు చపాతీ ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మెదపి ,కావలసిన పరిమాణం లో ఉండలు చేసి పెట్టుకోవాలి.
 8. పెనం పొయ్యిమీద పెట్టి సన్నని మంట మీద వేడి చేయాలి .ఈ లోగా
 9. ఒక ఉండని తీసుకొని పొడి పిండి సాయంతో చపాతీ లా వత్తుకుని పెనం మీదవేసి రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకోవాలి.
 10. ఇలా అన్ని ఉండాలని వత్తుకుని కాల్చుకోవాలి...కాల్చిన వాటిని వెంటనే హాట్ బాక్స్ లో పెట్టుకోవాలి.అంతే వేడి వేడి చపాతీలు సిల్వెర్ ఫాయిల్ లో చుట్టి కూర తో పాటుగా కొద్దిగా స్నాక్స్, పండ్ల ముక్కలతో లంచ్ బాక్స్ రెడీ సిద్ధం.

నా చిట్కా:

కూర ఒక పొయ్యిమీద అవుతుండగానే,ఇంకో పక్క చపాతీలు చేసుకుంటే పనికి ఇంకాతక్కువ సమయం పడుతుంది.

Reviews for Tri mix roti with cauliflower tomato curry. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo