హోమ్ / వంటకాలు / పనీర్ రోటీ రోల్స్

Photo of PANEER WRAP by Sandhya Rani Vutukuri at BetterButter
111
3
0.0(0)
0

పనీర్ రోటీ రోల్స్

Sep-08-2018
Sandhya Rani Vutukuri
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ రోటీ రోల్స్ రెసిపీ గురించి

హడావుడి జీవితాల్లో సరి అయిన పోషకాలు అందక అందరం బాధ పడుతున్నాము. కూర తింటే రోటీ తినరు. రోటి తింటే కూరలు తినరు. అందుకే ఇలాంటి వారి కోసమే పరాటాలు, ఫ్రాంకీలు పుట్టాయేమో. ఈరోజు నేను నా పిల్లలకు చేసిన పనీర్ రాప్ మీతో పంచుకుంటున్నాను.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ప్రతి రోజు
 • భారతీయ
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. రోటి రోల్ కోసం పిండి
 2. గోధుమపిండి 2 కప్పులు
 3. మైదా 2 చెంచాలు
 4. నూనె 1 చెంచా
 5. ఉప్పు చిటికెడు
 6. **********************
 7. వైట్ సాస్ కోసం(మయో)
 8. బట్టర్ 1/2 చెంచా
 9. మైదా 1/2 చెంచా
 10. పాలు 1 కప్పు
 11. ఉప్పు 1/8 చెంచా
 12. మిరియాల పొడి 1/4 చెంచా
 13. తురిమిన చీజ్ 3 చెంచాలు
 14. *******************************
 15. గ్రీన్ చట్నీ
 16. పుదీనా 1 కట్ట
 17. ఉల్లిపాయ 1(చిన్నది)
 18. పచ్చి మిర్చి 3
 19. ఉప్పు చిటికెడు
 20. **************************
 21. పనీర్ కూర
 22. పనీర్ 200 గ్రాములు
 23. ఉల్లిపాయలు 2 (మీడియం)
 24. టమాటాలు 2 పెద్దవి(లేదా3)
 25. అల్లంవెల్లుల్లి ముద్ద 1 చెంచా
 26. గరం మసాలా 1/2 చెంచా
 27. ఉప్పు 1 చెంచా
 28. ఎర్ర కారం 1 చెంచా
 29. టమాట కెచప్ 2 చెంచాలు
 30. నీళ్లు 2 కప్పులు

సూచనలు

 1. గోధుమపిండి, మైదా, నూనె,ఉప్పు కలిపి పిండిని రోటి కోసం తయారుగా 20ని.లు నాన నివ్వండి.
 2. ఒకటే శాతం లో మైదా, బట్టర్, 1/2 చెంచా మిరియాల పొడి, చిటికెడు ఉప్పు తీసుకోండి.
 3. మూకుడు పొయ్యి పై పెట్టి బట్టర్ వేసి కారుగుతూ వుండగా అదే శాతంలో మైదా వేసి ఆగకుండా కలపండి.
 4. 3,4 ని.ల దాకా ఆగకుండా కలపాలి.మంచి వాసన వచ్చాక స్టవ్ కట్టేసి పాలు పోసి బాగా కలిపి మళ్లీ పొంగు వొచ్చేదాక వుడక నివ్వండి.
 5. దింపి, ఉప్పు మిరియాల పొడి కలిపితే వైట్ సాస్ రెడీ.
 6. మిక్సీ లో ఒక కట్ట పుదీనా, ఉల్లి,మిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోండి.
 7. కూర కోసం ఉల్లిపాయలు, టమాట లు తరిగి పెట్టుకోండి
 8. మూకుడు పొయ్యి పై పెట్టి 2 చెంచాల నూనె వేసి, కాగాక అల్లంవెల్లుల్లి వేసి, ఉల్లి తరుగు వేయాలి.
 9. అవ్వి ఎర్రగా అవ్వగానే, టమాటో ముక్కలు, గరం మసాలా పొడివేసి దగ్గరయ్యే దాకా ఉడికించుకోవాలి
 10. టమాటో కెచప్ వేసి బాగా కలిపి ఉప్పు, కారం వేసి, 2 కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించి పనీర్ ముక్కలు వేసు కోవాలి.
 11. ఇప్పుడు రోటీలు చేసుకొని ముందుగా వైట్ సాస్, గ్రీన్ సాస్ ఇలాగ రాయాలి
 12. ఆ రోటి పైన పనీర్ కూర పెట్టి పూర్తి గా పరిచి, రోల్ చేయాలి.
 13. తరువాత పేపర్ టవల్ తీసుకొని, ఈ రోల్ ఉంచి నీట్ గా డబ్బాలో పెట్టి ఇవ్వండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర