పీనట్ కాప్సికం రైస్ | Peanut capsicum rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peanut capsicum rice recipe in Telugu,పీనట్ కాప్సికం రైస్, Sree Vaishnavi
పీనట్ కాప్సికం రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పీనట్ కాప్సికం రైస్ వంటకం

పీనట్ కాప్సికం రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanut capsicum rice Recipe in Telugu )

  • పల్లీలు 1 కప్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • నూనె 2-3 చెంచాలు
  • అన్నం 2 కప్స్

పీనట్ కాప్సికం రైస్ | How to make Peanut capsicum rice Recipe in Telugu

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి ఈ కాప్సికం ముక్కలు వేసి వేయించాలి
  3. మరో మూకుడు పెట్టి అందులో పల్లీలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో జీలకర్ర కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి
  5. దానిని మిక్సీ లో వేసుకుని పొడి చేసుకోవాలి
  6. తరువాత అందులో సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి
  7. దానిని వేగిన కాప్సికం లో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే
  8. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు ,పల్లీలు వేసి వేయించి అందులో కాప్సికం పల్లి మిశ్రమం వేసి అన్నం వేసి రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేయడమే

నా చిట్కా:

నచ్చితే కాజు కూడా వేసుకోవచ్చు

Reviews for Peanut capsicum rice Recipe in Telugu (0)