క్యాలీఫ్లవర్ కుర్మా పరోట | Coliflover kurma parota Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coliflover kurma parota recipe in Telugu,క్యాలీఫ్లవర్ కుర్మా పరోట, Vandhana Pathuri
క్యాలీఫ్లవర్ కుర్మా పరోటby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  55

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  7

  జనం

2

0

About Coliflover kurma parota Recipe in Telugu

క్యాలీఫ్లవర్ కుర్మా పరోట వంటకం

క్యాలీఫ్లవర్ కుర్మా పరోట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coliflover kurma parota Recipe in Telugu )

 • కుర్మా కి కావాల్సినవి : క్యాలీఫ్లవర్ 1
 • క్యారెట్ 2
 • బిన్స్ 10
 • ఉల్లిపాయలు 2
 • టమోటా 2
 • వెల్లుల్లి రెబ్బలు 10
 • కొత్తిమీర 1/2 కట్ట
 • అల్లం చిన్న ముక్క
 • పల్లిలు 1/2 గుప్పెడు
 • జీడిపప్పు 1/2 గుప్పెడు
 • గసగసాలు 2 స్పూన్స్
 • నూనె 3 టేబుల్ స్పూన్స్
 • గరం మసాలా 1 స్పూన్
 • ధనియాల పొడి 1 స్పూన్
 • ఉప్పు తగినంత
 • పసుపు 1/2 స్పూన్
 • కారం 2 స్పూన్స్
 • జిరా 1/2 స్పున్
 • ఆవాలు 1/2 స్పున్
 • పరోటా కి కావాల్సినవి : మైదా 1/2 కేజీ
 • పాలు 1 కప్పు
 • నీరు పిండి తడపడానికి సరిపడా
 • ఉప్పు 1/2 స్పూన్
 • నూనె సరిపడా

క్యాలీఫ్లవర్ కుర్మా పరోట | How to make Coliflover kurma parota Recipe in Telugu

 1. వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి
 2. ఉల్లిపాయలు టమోటా వేరువేరుగా పేస్ట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర అల్లం వెల్లులి కూడా పేస్ట్ చేసుకోవాలి
 3. జీడిపప్పు పల్లిలు గసగసాలు అరగంటముందే నానబెట్టి మిక్సీ పట్టాలి
 4. పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వెజిటబుల్స్ ఫ్రై వేసి పక్కన పెట్టుకోవాలి
 5. ఆయిల్ వద్దు అనుకుంటే వెజిటబుల్స్ ఉడికించుకోవచ్చు కూడా
 6. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి జిరా ఆవాలు ఉల్లిపాయలు పేస్ట్ వేసి వేయించాలి పసుపు ఉప్పు వేసి కొత్తిమీర పేస్ట్ టమోటా పేస్ట్ వేసి బాగా మగ్గించాలి
 7. మసాలా అంత పాచ్చివాసన పోయేవరకు వేయించాలి పక్కన వేయించుకున్న వెజిటబుల్స్ వేసి కారం గరం మసాలా ధనియాల పూడి జీడిపప్పు పేస్ట్ వెయ్యాలి తగినన్ని నీళ్లు పోసి పదినిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి
 8. ఇప్పుడు పరోటా తయారుచేసుకుందాం . ముందుగా మైదా పిండిలో పాలు, ఉప్పు , రెండు స్పూన్ నూనె వేసి అంత ఒకసారి కలపాలి. నూనె పిండికి బాగా పట్టాలనమాట .
 9. ఇప్పుడు నీటి తో చపాతీ డో కన్నా మెత్తగా పిండిని కలుపుకొని గంటసేపు నాన బెట్టాలి .
 10. పిండి ముద్ద తీసుకొని చపతిలా చేసి పైన నూనె రాసి వొత్తి పొడి పిండి చల్లాలి .
 11. రిబ్బన్ ను ముందుకు వెనుకకు మడిచినట్టు మడవాలి అదే నంది మనం చిన్నపుడు పేపర్ తో ఫ్యాన్ చేసేవాళ్ళం కదా అలాగా
 12. దాన్ని గుండ్రం గా చుట్టి మళ్ళీ చపతిలా చేసుకోవాలి .
 13. పెనం పై లో ఫ్లేమ్ లో రెండు వైపులా బంగారు రంగులో చుక్కలు వచ్చే దాకా కాల్చుకోవాలి.
 14. రుచికరమైన కాలీఫ్లవర్ కుర్మా మరియు పరోటా రెడీ .

నా చిట్కా:

మసాల వంటకాలు హెవీ గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా అకేషనల్ గా చేసుకుంటే బాగుంటుంది

Reviews for Coliflover kurma parota Recipe in Telugu (0)