హోమ్ / వంటకాలు / వాంగి బాత్

Photo of Vangi bath by Revathi Kumari at BetterButter
527
4
0.0(0)
0

వాంగి బాత్

Sep-09-2018
Revathi Kumari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాంగి బాత్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం వండడానికి :-
  2. 225 గ్రాములు బియ్యం
  3. 1/4 చెంచా ఉప్పు
  4. 2 కప్పుల నీళ్లు
  5. చింతపండు రసం:-
  6. 1/2 చెంచా చింతపండు
  7. 1/4 కప్ వేడి నీళ్లు
  8. వాంగి బాత్ రెసిపీ:-
  9. 2 చెంచాలు నూనె
  10. 1/2 చెంచా ఆవాలు
  11. 1/2 చెంచా మినపప్పు
  12. 2 చెంచాలు వేయించిన పల్లీలు
  13. 1 రెమ్మ కరివేపాకు
  14. 1/8 చెంచా ఇంగువ
  15. 1-2 ఎండుమిరపకాయలు
  16. 200 గ్రాములు తరిగిన వంకాయలు
  17. 1/4 చెంచా పసుపు
  18. 2 చెంచాలు వాంగిబాత్ మసాలా
  19. ఉప్పు తగినంత
  20. 1/2 చెంచా బెల్లం
  21. 2-3 చెంచాలు తరిగిన కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని నీళ్లలో 30 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. అరగంట తరువాత రెండు కప్పుల నీళ్లు, 1/4 చెంచా ఉప్పు నానబెట్టిన బియ్యం వేసి ౩ కూతలు వచ్చేవరకు ఉంచాలి
  3. ఇప్పుడు చింతపండుని నీళ్లలో ౩౦ నిమిషాలు నానబెట్టుకుని పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  4. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  5. అందులో ఆవాలు ,మినపప్పు, పల్లీలు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి ,ఇంగువ వేసి వేయించాలి
  7. అందులో వంకాయలు వేసి బాగా కలిపి వేయించాలి
  8. వేగిన తరువాత అందులో పసుపు ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  9. అందులో వాంగీబాత్ పౌడర్ వేసి వేసి బాగా కలుపుకోవాలి
  10. ఇప్పుడు అందులో చింతపండు పల్ప్ ,బెల్లం గ్రేవీ ల అయ్యే వరకు ఉడికించాలి
  11. ఇప్పుడు అందులో ఉడికిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తరువాత అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి
  12. దాని రైతా, పాపడ్స్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర