హోమ్ / వంటకాలు / మక్కి రోటి

Photo of CORN ROTI by Sandhya Rani Vutukuri at BetterButter
721
2
0.0(0)
0

మక్కి రోటి

Sep-10-2018
Sandhya Rani Vutukuri
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మక్కి రోటి రెసిపీ గురించి

వర్షా కాలంలో వొచ్చే మొక్క బట్టల తో మనం కంకులు కాల్చుకొని తింటాము. ఇంకా గారెలు చేస్తాము. ఉత్తర భారతీయులు చలికాలం లో వీటిని పిండి పట్టించి రొట్టె చేస్తారు. నేను ఈ సీజన్ లో డబ్బా లో ఈ రొట్టె లు కూడా పెడుతూ వుంటాను. మా బంధువులకు, స్నేహితులకు నేను చేసే ఈ మొక్కజొన్న రొట్టె చాలా ఇష్టం. మీరు చదివి వూరుకోక తప్పక చేయండి. అందరికీ ఈ రుచి నచ్చి తీరుతుంది. బాగా లేతవి కాకుండా, బాగా ఎర్ర గా ఎండినవి కాకుండా గింజలు(స్వీట్ కార్న్ కాదు) వలుచుకోవాలి. కంకులు ఎంచుకోవడం చాలా ప్రధానం. లేతవి బావుంటాయి. కానీ వలవలేము..ముదురు(ఎర్ర) వి బావుండవు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. లేత మొక్కజొన్న గింజలు 2 కప్పులు
  2. పచ్చి మిర్చి 3/4
  3. వెల్లుల్లి రెబ్బలు 2
  4. ఉప్పు 1/2 చెంచా

సూచనలు

  1. 2 కప్పుల గింజలు, మిర్చి, వెల్లుల్లి తీసుకోండి.
  2. వాటిని మిక్సీ లొనే(గ్రైండర్ వొద్దు) రుబ్బాలి.
  3. యే మాత్రం తడిలేని బాండీ(మొదట గా చేసేవారు నాన్ స్టిక్) తీసుకోండి.
  4. కొంచెం నూనె వేసి, ఒక బత్తాయి సైజ్ లో ముద్ద తీసుకొని పలుచగా ఇలా చేయాలి.
  5. మీకు ఇష్టమైన ఆకారంలో రకరకాలుగా వొత్తి, పొయ్యి పైన సన్న మంట పై కాల్చండి.
  6. 3,4 ని.ల తరువాత మూకుడు నుండి కాలి పైకి లేచి అంచులు ఎర్ర బడగానే తిప్పండి.(వేరే ఆకారం లోకూడా చేసాను)
  7. చల్లారాక బాక్స్ లో పెట్టండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర