అరటికాయ పెసరపప్పు కూర | Plaintain curry with moongdal Recipe in Telugu

ద్వారా Sailaja Chavali  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Plaintain curry with moongdal recipe in Telugu,అరటికాయ పెసరపప్పు కూర, Sailaja Chavali
అరటికాయ పెసరపప్పు కూరby Sailaja Chavali
 • తయారీకి సమయం

  50

  నిమిషాలు
 • వండటానికి సమయం

  55

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

అరటికాయ పెసరపప్పు కూర వంటకం

అరటికాయ పెసరపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Plaintain curry with moongdal Recipe in Telugu )

 • అరటికాయ 2
 • పెసరపప్పు 1 కప్
 • ఉప్పు తగినంత
 • పోపు
 • ఆవాలు 1 స్పూన్
 • మినప్పప్పు 1 స్పూన్
 • ఇంగువ 1 స్పూన్
 • జీలకర్ర 1/2 స్పూన్
 • ఎండు మిరపకాయలు 2
 • కరివేపాకు 1 రెబ్బ
 • నూనె 2 స్పూన్స్

అరటికాయ పెసరపప్పు కూర | How to make Plaintain curry with moongdal Recipe in Telugu

 1. పెసరపప్పు ను ఒక గిన్నెలోకి తీసుకుని సరిపడా నీరు పోసి ఉడక పెట్టుకోవాలి
 2. పప్పు మూడు వంతుల ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలు గా తరిగిన అరటికాయ లను కూడా వేసి మూత పెట్టి ఉడక నివ్వాలి
 3. పప్పు మరియు అరటికాయ బాగా ఉడికిన తరువాత స్టీవ్ ఆపెయ్యాలి
 4. ఇప్పుడు ఒక బాణాలి లో నూనె వేసి పోపు మొత్తం వేసుకుని వేగిన తరువాత ఉడికిన అరటికాయ పెసరపప్పు ని వేసి ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
 5. అరటికాయ పెసరపప్పు కూర సెర్వింగ్ కు రెడి. ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది..
 6. దీనికి ఉల్లిపాయ పులుసు లేదా ముక్కలు పులుసు లేదా చల్ల మిరపకాయలు నంచుకుని తింటే బాగుంటుంది .. :grinning:

నా చిట్కా:

పెసరపప్పు ని కుక్కర్ లో కన్నా విడిగా ఉడక పెడితె రుచి గా ఉంటుంది

Reviews for Plaintain curry with moongdal Recipe in Telugu (0)