హోమ్ / వంటకాలు / బీట్రూట్ రైస్

Photo of Beetroot rice by Chandrika Marripudi at BetterButter
1149
1
0.0(0)
0

బీట్రూట్ రైస్

Sep-11-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ రైస్ రెసిపీ గురించి

ఇది బీట్రూట్ తో చేసుకునే పులావ్ .పిల్లలకి లంచ్ బాక్స్ లోకి పెట్టివ్వడానికి తేలికగా ఉంటుంది.బీట్రూట్ కూరలా ఇష్టపడని వాళ్ళకి ఇలా చేస్తే ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బీట్రూట్ : 2 పెద్దవి తురుముకోవాలి
  2. ఉల్లిపాయ : 1
  3. పచ్చిమిర్చి : 4
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  5. లవంగాలు : 5
  6. దాల్చిన చెక్క : చిన్న ముక్క
  7. యాలకులు : 2
  8. ఉప్పు : తగినంత
  9. కొత్తిమీర : కొద్దిగా
  10. బియ్యం : 2 కప్పులు
  11. నూనె : 4 స్పూన్లు

సూచనలు

  1. బియ్యం కడిగి కాసేపు నానపెట్టుకోవాలి.
  2. స్టవ్ పైన గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక చక్క,లవంగాలు, యాలకులు వేసి వేపాలి.
  3. ఇపుడు ఉల్లి, పచ్చిమిర్చి వేసి వేగాక బీట్రూట్ తురుము వేసి వేయించాలి.
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మగ్గనివ్వాలి.
  5. తరువాత బియ్యం వేసి కలిపి 1 కప్ బియ్యం కి 2 కప్పులు నీళ్లు పోసి కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.
  6. రైస్ ఉడికాక కొతిమీర వేసి కలిపి సిమ్ లో 5 నిమిషాలు ఉంచి దించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర