ధనియాల దోశ | Coriander seeds Dosa Recipe in Telugu

ద్వారా Swathi Ram  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coriander seeds Dosa recipe in Telugu,ధనియాల దోశ, Swathi Ram
ధనియాల దోశby Swathi Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  6

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

ధనియాల దోశ వంటకం

ధనియాల దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander seeds Dosa Recipe in Telugu )

 • బియ్యం 2 కప్పులు
 • దాల్చిన చెక్క1
 • ధనియాలు 3 చెంచాలు
 • జిలకర 2 చెంచాలు
 • పెసరపప్పు 1 కప్పు
 • మెంతులు 1/2 స్పూన్
 • ఉల్లిపాయ ముక్కలు ఇష్టానుసారం
 • ఎండుమిర్చి 2

ధనియాల దోశ | How to make Coriander seeds Dosa Recipe in Telugu

 1. బియ్యం ,ధనియాలు , జీలకర్ర , పెసరపప్పు, మెంతులు ,దాల్చిన చెక్క ,ఎండుమిర్చి అన్ని శుభ్రం చేసుకొని 2గంటల. పాటు నానబెట్టిలి
 2. నానిన వాటిని వడబోసి సరిపడా మంచి నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
 3. రుబ్బిన పిండిని 3 గంటలు పాటు పూలవటానికి పక్కన పెట్టుకోవాలి
 4. పిండి లో సరిపడా ఉప్పు , చిటికెడు వంట సొడ వేసుకొని బాగా కలుపుకోవాలి
 5. దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి . దోస చుట్టూ ఒక చెంచాడు నూనె కూడా వేసుకోండి .
 6. బాగా ఎర్రగా కాలిన తరువాత ఉల్లిపాయ ముక్క లు, అల్లం పచ్చి మిర్చి ముక్కలు వేసి మడుచుకోండి .
 7. దీనిని పల్లి చట్నీ తో వడ్డించుకుంటే భలే రుచిగా ఉంటుంది .

నా చిట్కా:

ఈ దోశ వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి

Reviews for Coriander seeds Dosa Recipe in Telugu (0)