హోమ్ / వంటకాలు / పాలకూర గుడ్డు స్టఫింగ్ రోల్స్

Photo of Spinach egg stufing rolls by Chandrika Marripudi at BetterButter
535
2
0.0(0)
0

పాలకూర గుడ్డు స్టఫింగ్ రోల్స్

Sep-11-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర గుడ్డు స్టఫింగ్ రోల్స్ రెసిపీ గురించి

పాలకూర ,గుడ్డు తో పొరటులా చేసి చపాతీ పైన పెట్టి రోల్ చేసి ఇస్తే పిల్లలు, పెద్దలు ఎవరయినా మారు మాట్లాడకుండా తినేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మల్టీగ్రైన్ ఆటా : 3 కప్పులు
  2. ఉప్పు : తగినంత
  3. నూనె : 4 స్పూన్లు
  4. పాలకూర : 2కట్టలు
  5. ఉల్లిపాయలు : 2
  6. పచ్చిమిర్చి : 4
  7. కారం : 1స్పూన్
  8. ఆవాలు : 1 స్పూన్
  9. జీలకర్ర : 2 స్పూన్లు
  10. కోడిగుడ్లు : 4

సూచనలు

  1. పిండి ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు,నూనె వేసి నీళ్ళతో చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.
  2. స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
  3. తరువాత ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.
  4. ఇపుడు పాలకూర తరుగు వేసి కలిపి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించాలి.
  5. పాలకూర మగ్గాక గుడ్లను పగలకొట్టి వేసి కలుపుతూ వేగించాలి.
  6. కూర వేగాక 1 స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  7. కలిపిన పిండి ముద్దని చిన్న ముద్దలు చేసుకుని చపాతీలు వత్తుకుని పెనం పైన రెండు వైపులా కాల్చుకోవాలి.
  8. కాల్చుకున్న చపాతీల పైన కూరని పెట్టి మడిచి టూత్ పిక్ గుచ్చి పెట్టుకుంటే పాలకూర గుడ్డు స్టఫింగ్ రోల్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర