మరమరాల ఉప్మా | Puffed rice upma Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Puffed rice upma recipe in Telugu,మరమరాల ఉప్మా, Sree Vaishnavi
మరమరాల ఉప్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

మరమరాల ఉప్మా వంటకం

మరమరాల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puffed rice upma Recipe in Telugu )

  • మరమరాలు 2 కప్స్
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 1
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • నీళ్లు తగినంత
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు
  • కారం 1/8 చెంచా

మరమరాల ఉప్మా | How to make Puffed rice upma Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయ,పచ్చిమిర్చి తరుగుకోవాలి
  2. తరువాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు వేసి వేయించాలి
  4. అవి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం ,పసుపు వేసి బాగా వేయించాలి
  6. ఈలోపు మరమరాలు ని నీళ్లు పోసుకుని ఒక నిమిషము నానబెట్టుకోవాలి
  7. అందులో నీళ్లు పిండేసి అందులో వేసుకోవాలి
  8. దాని బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

నచ్చితే ఇందులో పుటనల పొడి కూడా వేసుకోవాలి

Reviews for Puffed rice upma Recipe in Telugu (0)