మిరియాల పొడి నెయ్యి దోస | Ghee pepper powder dosa Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  11th Sep 2018  |  
1 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ghee pepper powder dosa recipe in Telugu,మిరియాల పొడి నెయ్యి దోస, Revathi Kumari
మిరియాల పొడి నెయ్యి దోసby Revathi Kumari
 • తయారీకి సమయం

  6

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

1

మిరియాల పొడి నెయ్యి దోస వంటకం

మిరియాల పొడి నెయ్యి దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ghee pepper powder dosa Recipe in Telugu )

 • కారం కొరకు :-
 • మిరియాలు 2 చెంచాలు
 • వెల్లులి రెబ్బలు 4
 • ఎండుమిరపకాయలు 4
 • ధనియాలు 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • ఉప్పు తగినంత
 • దోస కొరకు :-
 • 1/2 కప్ అటుకులు
 • 5 చెంచాలు మినపప్పు
 • బియ్యం 1 కప్పు
 • నీళ్లు తగినంత
 • నెయ్యి లేదా బట్టర్ 2 చెంచాలు

మిరియాల పొడి నెయ్యి దోస | How to make Ghee pepper powder dosa Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
 2. అందులో మినపప్పు వేసుకోవాలి
 3. మినపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని అర గంట సేపు నాననివ్వాలి
 4. ఇప్పుడు మరో గిన్నె తీసుకోవాలి అందులో బియ్యం వేసుకోవాలి
 5. బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి
 6. అదే విధంగా అటుకులు కూడా నానబెట్టుకోవాలి
 7. అవి అన్ని నానిన తరువాత మిక్సీ జార్ లోకి తీసుకొని నీళ్లు పోసుకుని దోస పిండి ల చేసుకోవాలి
 8. అది ఒక ఆరు గంటల పాటు ఉరనివ్వాలి పిండి పొంగిపోకుండ చూసుకోవాలి
 9. ఆరు గంటల తరువాత అందులో ఉప్పు ,నచ్చితే బేకింగ్ సోడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
 10. ఇప్పడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో జీలకర్ర, ధనియాలు, వెల్లులి, ఎండుమిరపకాయలు ,మిరియాలు వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి
 11. వేగిన తరువాత అందులో ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి
 12. ఇప్పుడు మళ్ళి స్టవ్ మీద ఒక పెనం పట్టుకుని వేడి చేసుకోవాలి
 13. వేడి అయ్యిన తరువాత దోస వేయాలి
 14. దాని మీద తయారు చేసినా కారం పొడి ,నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి
 15. దాని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన దోస రెడీ

Reviews for Ghee pepper powder dosa Recipe in Telugu (1)

Prasad Proddutoori6 months ago

దీంట్లో ఏమి పెట్టుకొని తినాలి
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo